టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు జగపతిబాబు గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. గతంలో హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన జగపతి బాబు.. కొన్నేళ్ల నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. లెజెండ్ సినిమాతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జగ్గూ.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో మోస్ట్ బిజీస్ట్ యాక్టర్ గా మారిపోయాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు సౌత్ లో ఉన్నటువంటి స్టార్ హీరోలందరితో సినిమాలు చేసేశాడు. ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు.
ఈ క్రమంలో పరంపర అనే వెబ్ సిరీస్ లో నటించిన జగ్గూభాయ్.. తాజాగా పరంపర-2 రిలీజ్ అవ్వడంతో ఆ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. అయితే.. సినిమాలలో నటించిన తర్వాత చాలామంది నటులు రాజకీయాల్లోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు జగపతి బాబు కూడా రాజకీయాల్లోకి రాబోతున్నాడా? అనే ప్రశ్నను ఇంటర్వ్యూలో ఆయన ముందుంచారు. అలాగే పాలిటిక్స్ మీద ఆయనకున్న అభిప్రాయాలను సైతం బయట పెట్టాడు జగ్గూ.
సినిమానే మాయ.. పాలిటిక్స్ అనేది మాయా ప్రపంచం అని చెప్పిన జగ్గూ.. తన పొలిటికల్ ఎంట్రీపై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘పాలిటిక్స్ ని అర్థం చేసుకునే బుర్రా, ఓపిక నాకు లేవు. నాకు నలుగురితో మాట్లాడే తెలివే లేదు. ఇంకా పాలిటిక్స్ లో చేరడం.. అంటే చాలా కష్టం. నాలాంటోడు రాజకీయాలకు అసలు పనికిరాడు. నాకు పాలిటిక్స్ లో జీరో నాలెడ్జి’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జగ్గూ చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. జగ్గూభాయ్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీలో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మరి జగపతి బాబు పాలిటిక్స్ లోకి వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.