హీరోయిన్లు మారిపోతుంటారు బాసు. ఎంతలా అంటే అప్పుడెప్పుడో సినిమాల్లో కనిపిస్తారు. మళ్లీ చాన్నాళ్లకు ప్రత్యక్షమవుతారు. మరి 'జగడం' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?
తెలుగులో ప్రతి ఏడాది కొత్త హీరోయిన్లు రావడం ఎంత కామనో.. పాతవాళ్లు అలా అలా కనుమరుగవడం అంతే కామన్. టాలీవుడ్ అంటే ఇప్పుడే కాదు.. ఎప్పటినుంచో చాలా పాపులర్. అందుకే దేశంలో ఎక్కడ పుట్టినా సరే తెలుగులో హీరోయిన్ గా ప్రయత్నిస్తారు. కుదిరితే స్టార్ హీరోయిన్ అయిపోవచ్చు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవచ్చని అనుకుంటారు. అయితే కొన్నిసార్లు అలా జస్ట్ ఒకే ఒక్క మూవీతో ఫేమ్ తెచ్చుకున్నవాళ్లు కాస్త ఆ తర్వాత పూర్తిగా కనిపించకుండా పోవచ్చు. ఇప్పుడు చెప్పబోయే స్టోరీ అలాంటి ఓ హీరోయిన్ గురించే!
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ఆర్య’ లాంటి లవ్ స్టోరీతో ఇండస్ట్రీని షేక్ చేసిన సుకుమార్ తో సినిమా చేయాలని అప్పట్లో చాలామంది అనుకున్నారు. కానీ రామ్ తో ‘జగడం’ అనే మాస్ మూవీ తీశాడు. అప్పట్లో థియేటర్లలో అది సరిగా వర్కౌట్ కాలేదు. కానీ తర్వాత తర్వాత మాత్రం ఆ చిత్రానికి కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. రాజమౌళి లాంటి డైరెక్టర్.. ఓ సందర్భంలో ఆ మూవీని మెచ్చుకున్నాడు. అయితే మాస్ ఎలిమెంట్స్ తోపాటు రొమాంటిక్ సీన్స్ కూడా ఆ రేంజులో ఉన్నాయి. ఇషా సహానీ అనే బ్యూటీని హీరోయిన్ గా తీసుకొచ్చారు. రామ్ తో నెక్స్ట్ లెవల్ రొమాన్స్ పండించింది.
చాలా క్యూట్, అమాయకంగా ఇషా చేసిన యాక్టింగ్ అప్పట్లో యూత్ కి తెగ నచ్చేసింది. కానీ ‘జగడం’ ఫ్లాప్ కావడతో ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. తమిళంలో ‘బ్యాడ్ బాయ్’ చిత్రం చేసింది. ఆ తర్వాత పూర్తిగా కనుమరుగైపోయింది. స్వతహాగా డ్యాన్సర్ అయిన ఈమె.. అప్పట్లో చాలాచోట్ల లైవ్ షోల్లో డ్యాన్స్ తో ఎంటర్ టైన్ చేసింది. కొంతకాలానికి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని లండన్ లో సెటిలైపోయినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి సోషల్ మీడియాలో పెద్దగా కనిపించలేదు. అలాంటిది రీసెంట్ గా ఓ ఈవెంట్ లో ఇషా పాల్గొనడంతో ఆమె ఫొటోలు బయటకొచ్చాయి. మరి అప్పుడు ఇప్పుడు డిఫరెన్స్ చూసిన తర్వాత మీకేం అనిపించింది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.