బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు సహజీవనం చేస్తున్నారు. శృతిహాసన్ లాక్ డౌన్ మొత్తం తన బాయ్ ఫ్రెండ్ శాంతను అపార్ట్మెంట్ లోనే ఉంది. అలియాభట్ కూడా తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ తోనే కలిసి ఉంటోంది. ఇప్పుడు ఇదే లిస్ట్ లో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా చేరింది. శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా ఈ బ్యూటీ దక్షిణాదికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తోందట. బాలీవుడ్ కథనాల ప్రకారం జాక్వెలిన్ తన ప్రియుడితో కలిసి ముంబై జుహూలో రూ. 175 కోట్లతో బంగ్లాను కొనుగోలు చేశారన్నది సమాచారం. ఈ కొత్త నివాసానికి ఇంటీరియర్ డిజైన్ చేయించడానికి ఒక ఫ్రెంచ్ ఇంటీరియర్ డిజైనర్‌ను కూడా ఖరారు చేశారని భోగట్టా.
జాక్వెలిన్ ప్రేమలో ఉన్నది ప్రముఖ దర్శకుడు–వ్యాపారవేత్త అయిన సాజిద్ ఖాన్‌తోనే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 2011లో ‘హౌస్‌ఫుల్ 2’ చిత్రీకరణ సమయంలో సాజిద్ ఖాన్‌తో ఆమె డేటింగ్ చేశారని, 2013లో బ్రేకప్ అయ్యారని టాక్. అయితే ఆ బ్రేకప్‌కి ఇద్దరూ ఫుల్‌స్టాప్ పెట్టి, ప్రేమను కంటిన్యూ చేస్తున్నారని బాలీవుడ్ లో గుసగుసలు. ప్రభాస్ ‘సాహో’లో ప్రత్యేక పాట ‘బ్యాడ్ బాయ్’కి జాక్వెలిన్ డ్యాన్స్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. 175 కోట్లతో బంగ్లా సంగతేమో కానీ ఈ టాపిక్ బాగా వైరలై సాగుతోంది. సెలబ్రెటీలకు కావల్సింది అదే కదా.