బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్లు కెరీర్ బిగినింగ్ లో మోడలింగ్ గా చేసి ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయ్యారు. మిస్ ఇండియా, మిస్ యూనివర్సీ లుగా గెలుపొందిన వారు తర్వాత మోడలింగ్ లో అడుగు పెట్టి హీరోయిన్లుగా రాణించారు. శ్రీలంక కు చెందిన నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మోడలింగ్ లో రాణించి బాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది.
బాలీవుడ్ లో చాలా వరకు హీరోయిన్లు కెరీర్ బిగినింగ్ లో మోడలింగ్ లో సత్తా చాటిన తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంగా ఎంపికైన తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. 2011లో మర్డర్ 2 చిత్రంతో మంచి విజయం అందుకుంది.. ఆ తర్వాత గ్లామర్ తరహా పాత్రల్లో ఎక్కువగా నటించింది. ఇటీవల జాక్వెలిన్ పై మనీలాండరింగ్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. రూ.200 కోట్ల మోసం కేసులో నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ కి ఉన్న సంబంధాల నేపథ్యంలో కేసు నమోదు అయ్యింది.
మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బుధవారం ఢిల్లీ పటియాల హౌస్ కోర్టుకు హాజరైంది. సుకేశ్ చంద్రశేఖర్ కి సంబంధించిన రెండు వందల మనీలాండరింగ్ కేసు విషయంలో ఆమె నేడు కోర్టుకు హాజరైంది. ఈ కేసులో గురువారం అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నట్టు ఈడీ కోర్టుకు తెలియజేసింది. ఎఫ్ఎస్ఎల్ నివేధికల ఆధారంగా దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థను కోర్టు ఆదేశించింది. ఈ విషయంపై ఏప్రిల్ 18 న మరోసారి విచారణ జరగనున్నది. బాలీవుడ్ నటి జాక్వెలిన్.. సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యాపారితో కలిసి రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కి పాల్పపడిన కేసులో ఈడీ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు జాక్వెలిన్ ని ఈడీ విచారించింది.
సుఖేశ్ చంద్రశేఖర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలోనే ఆమెకు సుఖేశ్.. జాక్వెలిన్ కు 5.71 కోట్ల రూపాయల విలువైన బహుమతులు ఇచ్చారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఆ తర్వాత సుకేశ్ తో జాక్వెలిన్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సైతం బయటకు వచ్చాయి. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను జాక్వెలిన్ ఖండించింది. ఈ కేసులో తనను కొంతమంది కావాలని ఇరికించారని.. సుఖేశ్ తన జీవితాన్ని.. కెరీర్ ని మొత్తం నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఇటీవల అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ నటించిన సెల్ఫీ, దీవానే చిత్రాల్లో ఐటమ్ సాంగ్ లో నటించింది. ప్రస్తుతం జాక్వెలిన్ ఫతే చిత్రంలో నటిస్తుంది. కాగా, ఈ కేసులో మరో నటి నోరా ఫతేహి పేరు కూడా వినిపించింది.
#WATCH | Actor Jacqueline Fernandez arrives at Delhi’s Patiala House court, in connection with hearing in Rs 200 crore money laundering case pic.twitter.com/jpqR3eIIEy
— ANI (@ANI) April 5, 2023