బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న లేడీ గెటప్ ఆర్టిస్టులలో వినోద్ అలియాస్ వినోదిని ఒకరు. జబర్దస్త్ లో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే మంచి టైమింగ్ తో గుర్తింపు తెచ్చుకున్న వినోద్.. షోలో మాత్రం వినోదినిగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా వినోద్ సోషల్ మీడియా వేదికగా తన ఫ్యామిలీకి సంబంధించి ఓ శుభవార్తను బయటపెట్టాడు. ఈ గుడ్ న్యూస్ చెబుతూ ఓ వీడియోని కూడా రిలీజ్ చేశాడు వినోద్.
ఇక వివరాల్లోకి వెళ్తే.. జబర్దస్త్ షో ప్రారంభమైన కొత్తలో ఎందుకోగానీ ఆడవాళ్లను స్కిట్ లలో పెట్టకూడదని చెప్పారు. అందుకే స్త్రీ పాత్రలను మగవారే చేస్తూ వచ్చారు. ఆ విధంగా లేడీ గెటప్ ధరించి ఫేమ్ అయ్యాడు వినోద్. చమ్మక్ చంద్ర, సాయితేజ, శాంతి స్వరూప్ లతో పాటు వినోద్ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఆ మధ్యలో పెళ్లి చేసుకోనంటూ ఆత్మహత్యాయత్నం చేసిన ఇన్సిడెంట్ చర్చలకు దారితీసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత తనకు బంధువులైన అత్త కూతురు విజయలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. అయితే.. వినోద్ భార్య ప్రెగ్నెంట్ అని ఇటీవల క్యాష్ ప్రోగ్రామ్ ద్వారా తెలిసింది. ఈ షోకి వచ్చాకే యాంకర్ సుమ.. విజయలక్ష్మిని గర్భవతి అని గుర్తించి అప్పటికప్పుడు సీమంతం కూడా జరిపించింది. విజయలక్ష్మికి తల్లి లేని లోటు తీరుస్తూ సీమంతం చేసిన సుమకు ధన్యవాదాలు కూడా తెలుపుకున్నారు. పుట్టబోయే బిడ్డనే తల్లిగా భావించి ఆనందంగా ఉంటామని చెప్పుకొచ్చారు వినోద్, విజయలక్ష్మి.
తాజాగా వినోద్ సోషల్ మీడియా వేదికగా తనకు పాప పుట్టిందనే విషయాన్ని వీడియో ద్వారా తెలియజేశాడు. వీడియోలో పాప ఫోటోలను కూడా రివీల్ చేశాడు. ప్రస్తుతం వినోద్ – విజయలక్ష్మిలకు తోటి జబర్దస్త్ కంటెస్టెంట్స్ తో పాటు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పుడు వినోద్ పోస్ట్ చేసిన బేబీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి జబర్దస్త్ వినోద్ – విజయలక్ష్మిలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.