Jabardasth Venky: జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కలాకారులు కళాకారులుగా రాణిస్తున్నారు. ఎంతో గుర్తింపు, క్రేజ్ సంపాదించుకుని సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నారు. వీళ్ళు సెలబ్రిటీలు అయ్యారంటే దాని వెనుక కుటుంబ సభ్యుల సపోర్ట్ ఎంతగానో ఉంటుంది. ఆ విషయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ప్రతీ సెలబ్రిటీ విజయం వెనుక ఒక ఒక కుటుంబం ఉంటుంది. అందుకే ఆ కుటుంబాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు షో నిర్వాహకులు.
గత కొంతకాలంగా జబర్దస్త్ షో ద్వారా కమెడియన్స్ కుటుంబ సభ్యులను ప్రేక్షకులకు పరిచయం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా జబర్దస్త్ వెంకీ తన భార్యను వేదికపై పరిచయం చేశారు. ‘ఎన్నెన్నో జన్మల బంధం’ పాటతో వెంకీ దంపతులు ఎంట్రీ ఇచ్చారు. మరి కుటుంబ సభ్యులు వచ్చాక కమెడియన్స్ పంచులు వేయించుకోవడం మామూలే కదా. వెంకీ కూడా తన మీద సెటైర్లు వేయించుకున్నారు. వెంకీ మీద ఆమె భార్య పంచులు వేస్తుంటే జడ్జిలు, యాంకర్లు కడుపుబ్బా నవ్వుకున్నారు.
లవ్ మ్యారేజా? అరేంజిడ్ మ్యారేజా? అని ఇంద్రజ అడగగా.. లవ్ మ్యారేజ్ అని వెంకీ జవాబిచ్చారు. ముందు ఎవరు ప్రపోజ్ చేశారు అని అడగగా.. తానే మొదటగా ప్రపోజ్ చేశానని అన్నారు. తాను మిమిక్రీ ఆర్టిస్ట్ అయితే.. తన భార్య కూచిపూడి డ్యాన్సర్ అని అన్నారు. ఇంకా తన భార్య గురించి, కుటుంబం గురించి మరిన్ని విషయాలను చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వెంకీ భార్య.. స్టేజ్ పై మోకాలిపై కూర్చుని గులాబీ పువ్వుతో ప్రపోజ్ చేస్తూ వెంకీకి సర్ ప్రైజ్ ఇచ్చారు.
ఈ ఎపిసోడ్ లో వెంకీ బాగా ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది. జబర్దస్త్ స్టేజ్ పైకి భార్యతో పాటు వెంకీ తన ఇద్దరి పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. ఈ షో జూలై 21న ప్రసారం కానుంది. మరి.. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఎక్కువ డబ్బు కోసం జబర్దస్త్ వదిలేసిన వాళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు: ఏడుకొండలు