అతి తక్కువ కాలంలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’’ ఒకటి. ప్రతివారం సరికొత్త ఐడియాలతో.. స్పెషల్ గెస్ట్ లతో టీవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ షోకు సంబంధించి కొత్త ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షో.. కొత్త ప్రోమో అంతా పంచులు, ఎమోషన్స్‌తో నింపేశారు. ప్రోమో బట్టి ఎపిసోడ్ కూడా ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది.
ఈ నెల 6వ తేదీ ‘‘ ఉమెన్స్ డే’’ను పురస్కరించుకుని షోలో స్పెషల్ ఈవెంట్ జరిగింది. ఈ షోకు కొంతమంది సభ్యుల తల్లులు, మరికొంతమంది సభ్యుల తోబుట్టువులు వచ్చారు. ఎప్పటిలాగే షో ప్రోమో పంచులతో మొదలైంది. ఈ క్రమంలో కొంతమంది ‘ఉమెన్స్ డే’ స్పెషల్ సాంగ్‌లకు ఫర్మార్మెన్స్ ఇచ్చారు. ‘మగువ, మగువ’ సాంగ్‌కు సుజాత అండ్ టీం చేసిన ఫర్మార్మెన్స్ చూసి జబర్దస్త్ వర్ష ఎమోషనల్ అయిపోయి బాగా ఏడ్చేసింది. సుజాత పర్మార్మెన్స్ అనంతరం వర్ష మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు చూసినవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆడవాళ్లకు ఎప్పుడూ ఉండదా వ్యాల్యూ?.. ఇంకెన్ని రోజులు’’ అంటూ వెక్కివెక్కి ఏడ్చేసింది.దీంతో షోలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయారు. షోను చూడ్డానికి వచ్చిన కొంతమంది మహిళా ప్రేక్షకులు కూడా ఏడ్చేశారు. అంతకు ముందు ‘ఏ నోము నోచిందో.. ఏ పూజ చేసిందో’’ పాటకు పర్మార్మెన్స్ చూసి ఇమ్మాన్యుయేల్ తల్లి ఎమోషనల్ అయింది. తన కొడుక్కి పెళ్లయిన తర్వాత తన పరిస్థితి కూడా అలానే ఉంటుందేమో అంటూ బోరున ఏడ్చింది. ఇలా షో మొత్తం మూడు నవ్వులతో.. ఆరు కన్నీళ్లతో సాగింది. ఈ పవర్ ప్యాక్ ఎమోషన్స్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి..