జబర్దస్త్ లో వర్ష- ఇమ్మాన్యుయేల్ జంటకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సుధీర్- రష్మీ పెయిర్ తర్వాత ఆ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది వర్ష-ఇమ్మూలకే. అయితే వీర మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్లు హోలీ స్పెషల్ ఈవెంట్లో వీళ్లు బాహాటంగానే గొడవ పడ్డారు. ఇమ్మూ అయితే అందరి ముందే మగాడు అనగానే వర్ష చాలా ఫీల్ అయ్యింది. అంతకన్నా ముందు ఆది, రాంప్రసాద్ వీళ్లు కామెంట్ చేసినా జోవియల్ తీసుకుంది. కానీ, ఇమ్మాన్యుయేల్ అనగానే తట్టుకోలేక లేచి వెళ్లిపోయింది.
ఇదీ చదవండి: బ్యాక్ గ్రౌండ్ లేదు కష్టమన్నారు: నవీన్ పొలిశెట్టి
అందరూ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఇమ్మాన్యుయేల్ అనడమే కాకుండా.. బుల్లెట్ భాస్కర్ కూడా మా ఆవిడ లేడీ గెటప్పా అని చాలాసార్లు అడిగింది అనగానే ఆమెకు ఇంకా కోపం వచ్చేసింది. ‘నోరు తెరిస్తే అబ్బాయి అంటున్నారు. అనడానికైనా ఉండాలి. ఒకసారి రెండుసార్లు అంతేగానీ ప్రతిసారి అంతేనా?’ అంటూ వర్ష వెనక్కి రాలేదు. ఇమ్మాన్యుయేల్ సారీ అన్నా కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇమ్మూ కూడా చాలా సీరియస్ అయ్యాడు. అసలు నేనెందుకు సారీ చెప్తాను. ఆది అనమన్నాడు అన్నాను అంటూ సీరియస్ అయ్యాడు.
సాధారణంగా ఇది స్కిట్ లో భాగమనే అనుకోవచ్చు. కానీ, ఈసారి ఇమ్మాన్యుయేల్ కూడా చాలా సీరియస్ అవగానే ఇది నిజం అవుతుందేమో అనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే గతంలోనూ వారి మధ్య సఖ్యత లేదనే వార్తలు వచ్చాయి. తాజాగా వర్ష కూడా మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడకు అంటూ కామెంట్ చేసింది. ఆ మాట పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రోమో చూసిన ప్రేక్షకులు మాత్రం.. ‘ఒకసారి అయితే మేము ఫూల్స్ అవుతాం.. ప్రతిసారి చేస్తే మీరవుతారు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది టీఆర్పీ స్టంటే అని ఆడియన్స్ మాత్రం కొట్టిపారేస్తున్నారు. వర్ష-ఇమ్మాన్యుయేల్ నిజంగానే గొడవ పడ్డారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.