Shaking Sheshu: జబర్దస్త్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ స్కిట్స్ చేసిన ఆర్పీ.. ఇటీవల జబర్దస్త్ నిర్వహిస్తున్న సంస్థపై, తోటి కమెడియన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలో కిరాక్ ఆర్పీ జబర్దస్త్ నుండి బయటికి రావడానికి కారణం ఇదేనంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి.
ఇక కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ పై హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ సైతం స్పందించారు. జబర్దస్త్ గురించి, ఆ షో నిర్వహిస్తున్న సంస్థపై చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలనే అని కొట్టిపారేశారు. అలాగే ఆర్పీ చేసిన ఆరోపణలకు తాము క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే వచ్చామంటూ చెప్పుకొచ్చారు. అయితే.. తాజాగా మరో జబర్దస్త్ కమెడియన్ షేకింగ్ శేషు.. కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలపై స్పందించడమే గాక, ఆర్పీ జబర్దస్త్ నుండి ఎందుకు బయటికి వచ్చాడనే విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కిరాక్ ఆర్పీ సినిమాల కోసమే జబర్దస్త్ నుండి బయటికి వచ్చాడా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. “కిరాక్ ఆర్పీ వాళ్ళ ఊరిలోనే ఓ ప్రొడ్యూసర్ ఉంటే.. ఆ ప్రొడ్యూసర్ ని ఓ సినిమా తీద్దాం అని ఒప్పించి, జేడీ చక్రవర్తి గారితో ఓపెన్ చేయించాడు. ఆరోజు నాగబాబు గారు కూడా రావడంతో మంచి హడావిడి చేశారు. దీంతో ఆర్పీ సినిమా ఏదో పెద్ద సినిమా అవ్వబోతుందని మేం ఆనందించాం. ఆ సినిమాతో ఆర్పీ ఎక్కడికో వెళ్ళిపోతాడు అనుకున్నాం. తర్వాత సిటీకి వచ్చి నెలకు 50 వేల రెంట్ తో ఆఫీస్ ఓపెన్ చేశాడు.
సినిమా స్టార్ట్ అవ్వకుండానే 20 లక్షలు ఖర్చు చేసేశాడు. దీంతో నిర్మాత నా డబ్బు నాకిచ్చేయాలని వారించి, ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు. ఆ సినిమా అక్కడే ఆగిపోయింది. ఆర్పీ వలన జబర్దస్త్ కి మచ్చ పడింది. అలాంటి ఫ్రాడ్ జబర్దస్త్ సంస్థని నిందిస్తాడా? దూషిస్తాడా? అని ఫైర్ అయ్యాడు శేషు. అంతేగాక హోమ్ టూర్ అంటూ ఆర్పీ చూపించిన ఇల్లు కూడా వాడిది కాదని, వేరేవాళ్ళ ఇంటిని వీడి ఇంటిలా చూపించాడని చెప్పుకొచ్చారు శేషు. ప్రస్తుతం ఆర్పీ గురించి శేషు మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.