నిన్న మొన్నటి వరకు రీల్ లైఫ్ జంటలు అంటే.. ప్రేక్షకులు అంతా సినీ ఇండస్ట్రీ వైపే చూసేవారు. కానీ.., ఈ మధ్య కాలంలో బుల్లితెర జంటలకి కూడా క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ ట్రెండ్ ను సృష్టించింది మాత్రం సుధీర్-రష్మీ పెయిర్ అనే చెప్పుకోవాలి. జబర్దస్త్ రేటింగ్స్ లేచింది కూడా వీరిద్దరూ జత కట్టిన తరువాతనే. ఇక గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ చాలానే వార్తలు పుట్టుకొచ్చాయి. రష్మీ, సుధీర్ కూడా ఈ వార్తలను తీవ్ర స్థాయిలో ఖండించింది లేదు. దీంతో.. ఈ రీల్ లైఫ్ జంట రీల్ లైఫ్ లో కూడా కలవకపోతారా అని వీళ్ళ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తునే ఉన్నారు. కానీ.., వీరి ప్రేమ నిజంగా నిజమేనా? లేదా షో రేటింగ్స్ కోసం నటిస్తున్నారా అనే విషయంలో ఇంకా చాలా మందికి క్లారిటీ లేదు. అయితే.. జబర్దస్త్ కమెడియన్ సతీశ్ ఈ విషయంలో తాజాగా ఓ సంచలన వార్తని బయట పెట్టాడు.
సతీశ్ ఎక్కువగా చమ్మక్ చంద్ర, ముక్కు అవినాష్ టీమ్స్ లో నటించాడు. కానీ.., ఈ మధ్య కాలంలో ఆయన జబర్దస్త్ వేదికపై కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సతీశ్ ఓ సంచలన నిజాన్ని బయటపెట్టారు. “అంతా సుధీర్, రష్మీ మధ్య ఏముందని అడుగుతుంటారు. నిజానికి వారిద్దరి మధ్య ఏమి లేదు. షోస్ రేటింగ్స్ కోసం వాళ్ళని పెయిర్ గా చూపిస్తారు. ప్రేక్షకులు దానిని నిజం అనుకుని మోసపోతుంటారు. రష్మీ, సుధీర్ పెళ్లి చేసుకోవాలని కామెంట్స్ పెడుతుంటారు.
షో అయిపోయిన తరువాత ఇక్కడ ఎవరి జీవితాలు వాళ్ళకి ఉంటాయి. ఎవరి పనుల్లో వాళ్ళం ఉంటాము. సుధీర్ రష్మీ కూడా ఒకరిని ఒకరు పట్టించుకోరు.అసలు రష్మీకి పెళ్లి అయిపోయిందని వీళ్ళకి తెలుసా? అంటూ సతీశ్ నోరు జారేశాడు. యాంకర్ కూడా రష్మీకి పెళ్లి అయిపోయిందా అని మళ్ళీ ప్రశ్నిచడంతో సతీశ్ ఇష్యూని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.., అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రావాల్సిన నిజం బయటకి వచ్చేసింది. దీంతో.. ఇప్పుడు రష్మీకి పెళ్లి ఎప్పుడు అయ్యింది? ఆమె భర్త ఎవరు అంటూ హాట్ టాపిక్ నడుస్తోంది. మరి జబర్దస్త్ సతీశ్ చెప్పినట్టు రష్మీకి పెళ్లి అయిపోయి ఉంటుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.