జబర్దస్త్ రీతూ చౌదరి.. నిజానికి ఈమె ముందు నుంచే సీరియల్స్ లో నటిస్తున్నా కూడా జబర్దస్త్ షోతోనే మంచి గుర్తింపు లభించింది. ఎంత గుర్తింపు అంటే.. కామెడీ షో పేరు ఇంటి పేరుగా మారిపోయింది. జబర్దస్త్ రీతూ అనే అంతలా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం పొందేసింది. తన అందం, అమాయకత్వం, కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ ఉంటుంది.
ఇటీవలే మహీంద్రా థార్ కారు కొనుగోలు చేసిన రీతూ చౌదరి.. ప్రస్తుతం మరో సూపర్ కారుతో ఫొటోలకి ఫోజులు ఇచ్చింది. అది సాదా సీదా కారు కాదులెండి.. జాగ్వార్ XE కారు డ్రైవ్ చేస్తూ ఓ వీడియో కూడా ఇన్ స్టా స్టోరీలో అప్ లోడ్ చేసింది. ఇప్పుడు జాగ్వార్ కారుతో స్టిల్స్ దిగి హార్ట్ సింబల్ తో ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టింది. అయితే ఆ కారును కొనుగోలు చేసిందా? లేదా? అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
రీతూ చౌదరి పెట్టిన కారు జాగ్వార్ XEగా తెలుస్తోంది. ఆ కారు ప్రారంభ ధర 46 లక్షల నుంచి 48 లక్షల వరకూ ఉంటుంది. ఈ కారుని సూపర్ కారు అని ఎందుకు అన్నామంటే.. ఇది బీఎస్ సిక్స్ ఇంజిన్, 1995 సీసీ, 250 టాప్ స్పీడ్ తో అందుబాటులో ఉంది. ఇది కేవలం ఆటోమాటిక్ వేరియంట్ ల మాత్రమే లభిస్తోంది. కేవలం 6.5 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదు. రీతూ చౌదరి పెట్టిన జాగ్వార్ కారు పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.