Ram Prasad: తెలుగు బుల్లితెరపై పాపులర్ షో అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది జబర్దస్త్. కొన్నేళ్లుగా తెలుగు ప్రేక్షకుల చేత విశేషదారణ పొందుతున్న జబర్దస్త్ షో ద్వారానే ఎంతోమంది టాలెంట్ ఉన్న కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు. అలాంటివారిలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర ఇలా చాలామంది సెలబ్రిటీ స్టేటస్ అందుకున్నారు. అయితే.. జబర్దస్త్ ద్వారా పాపులారిటీ దక్కించుకున్న వారిలో కిరాక్ ఆర్పీ ఒకరు.
జబర్దస్త్ లో టీమ్ సభ్యుడిగా కెరీర్ ప్రారంభించిన ఆర్పీ.. ఆ తర్వాత ఎన్నో స్కిట్స్ చేసి తన టాలెంట్ తో టీమ్ లీడర్ అయ్యాడు. మంచి పేరు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే.. మధ్యలో ఏమైందోగానీ జబర్దస్త్ నుండి బయటికి వెళ్ళిపోయి.. ప్రస్తుతం కామెడీ స్టార్స్ లో స్కిట్స్ చేస్తూ, సొంతంగా సినిమా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడు. అదీగాక త్వరలోనే తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు ఆర్పీ.
ఈ క్రమంలో ఇటీవలే సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్పీ.. జబర్దస్త్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అలాగే తన ఛాతిపై మెగాబ్రదర్ నాగబాబు పేరును టాటూ వేయించుకున్నట్లు చూపిస్తూ.. నాగబాబు పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టాడు. అయితే.. తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్.. ఆర్పీ వేయించుకున్న టాటూపై స్పందించారు.
రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. “టాటూ వేయించుకోవాలంటే మూడేళ్ళ క్రితమే ఈ విషయాలన్నీ జరిగిపోవాలి. రీసెంట్ గా ఓ టీవీ షోలో ఆ టాటూ చూశాం. అంతకుముందు ఎప్పుడు లేదు ఆ టాటూ. మరి సడన్ గా వేయించుకున్నాడు అంటే.. నాగబాబు గారి మీద గౌరవం, ఇష్టం.. ఓకే దాంట్లో తప్పేమి లేదు. మామూలుగా బయట చాలామంది హీరోల ఫ్యాన్స్ వేయించుకుంటారు కదా.. టాటూస్ ఆర్పీ కూడా అంతే” అని చెప్పాడు. ప్రస్తుతం ఆర్పీ టాటూపై రామ్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి రామ్ ప్రసాద్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.