బహుబలితో గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు డార్లింగ్ ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనను తాను నిరూపించుకున్నారు. వరుస పెట్టి సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఆతిధ్యమంటేనే ఉప్పలపాటి వారి కుటుంబం పేరు వినిపిస్తుంది. తాజాగా ఓ సినిమా షూటింగ్ లో ఆయన ఇచ్చిన ఆతిధ్యం గురించి చెప్పారు..జబర్థస్త్ మహేష్.
ప్రభాస్.. తెలుగు పరిశ్రమకు దొరికిన కటౌట్. యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ముద్దు పేర్లు. బహుబలితో గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఎంత ఎదిగినా అంత ఒదిగే ఉండాలన్నదీ అతని నైజం. రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనను తాను నిరూపించుకున్నారు. వరుస పెట్టి సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఆదిపురుష్ రిలీజ్‌కు సిద్దమవుతుండగా.. సలార్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె, మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్(ఇంకా నిర్ధారణ చేయలేదు) సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. అయితే ప్రభాస్ అనగానే స్నేహంతో పాటు ఆయనిచ్చే ఆతిధ్యం గురించి నటీనటులు చెబుతుంటారు. అసలు ఉప్పలపాటి కుటుంబం అంటేనే తిండి పెట్టి చంపేస్తారన్న పేరు ఒకటి ఉంది. ఇప్పటికే స్టార్ నటీనటులంతా ఈ విషయాన్ని చెప్పారు. అయితే నటుడు జబర్థస్త్ మహేష్.. సుమన్ టివీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మారుతి, ప్రభాస్ సినిమాలో నటిస్తున్నారు జబర్థస్త్ మహేష్. ఈ షూటింగ్ సందర్భంగా ప్రభాస్‌తో జరిగిన కొన్ని సంఘటనలు గురించి చెప్పారు. మారుతితో సినిమా గురించి మాట్లాడుతూ ‘మాట ఇచ్చాక నిలబెట్టుకోవడమే ప్రభాస్ గొప్పతనం’అని అన్నారు. మారుతి సినిమాలో ఆయన అన్ స్టాపబుల్ షోలో కనిపించినట్లుగా ఉంటారన్నారు. డార్లింగ్, మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఎనర్జీ కనిపిస్తుందని, లుక్స్ అదిరిపోయిందన్నారు. చెక్స్ షర్ట్స్ లో సూపర్ ఉన్నారన్నారు. పక్కా కామెడీ సినిమా చేస్తున్నారన్నారు. అలాగే షూటింగ్ సమయంలో ఆయన తెప్పించిన ఫుడ్ గురించి చెప్పారు మహేష్. అందరూ చెబుతుంటే విన్నాను కానీ..తాను చూశానంటూ ఎగ్జైట్ అయ్యారు.
‘షూటింగ్ సమయంలో ..200, 300 మందికి ఫుడ్ తెప్పించారు. అందరూ కుమ్మేసాం. నేను మటన్ బాగా తిన్నాను. నేనేతై దాడి చేశాను. ఏం నచ్చింది రా అని అడిగారు. మటన్ అన్నా అనగానే..మళ్లీ రేపొద్దున మహేష్‌కు మటన్ తెప్పించండి అన్నారు. ఆయనే ఇంటి నుండి వండించి, పంపించారు. అందరూ చెబుతుంటే విన్నాను కానీ..ఆ రోజు చూశాను. నెక్ట్ లెవల్ అంతే. ఆయనతో వర్క్ చేస్తుంటే.. ఇంకా చాలా రోజులు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. జీవితాంతం ఆయనతో షూటింగ్ ఉంటే బాగుంటుందని అనుకున్నాను’అని చెప్పారు. రంగస్థలం సినిమాను చూసి ప్రభాస్ తనను మెచ్చుకున్నారని చెప్పారు.
‘వచ్చి రంగస్థలంలో బాగా చేశావ్’ అని మెచ్చుకుంటూ హగ్ చేసుకునే సరికి..నమ్మబుద్దికాలేదు. ఆయన సింప్లిసిటీగా అందరి ముందు చెప్పారు. ఐదేళ్ల తర్వాత కూడా గుర్తు పెట్టుకుని అభినందించడం చాలా ఆనందం వేసిందని అన్నారు. అయితే మారుతి, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న రాజా డీలక్స్ గురించి చెప్పడంతో ప్రజలు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రభాస్‌లో ఉన్న ఫన్నీ వ్యక్తి మళ్లీ తెరపైకి వస్తున్నాడన్నహింట్ లో చెప్తే చెప్పావ్ కానీ బాసూ.. కడుపు నిండిపోయిందీ అంటూ మహేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న నటులను సైతం గుర్తు పెట్టుకుని ఆతిధ్యం ఇస్తున్న ప్రభాస్ గురించి తెలిసి.. అదీ మా ప్రభాస్ అంటే అని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.