గత కొంత కాలంగా జబర్దస్త్ షో చుట్టూ వివాదాలు నడుస్తోన్న సంగతి తెలిసిందే. కమెడియన్ ఆర్పీ.. జబర్దస్త్ షోపై సంచలన ఆరోపణాలు చేశాడు. అక్కడ ఆర్టిస్ట్‌లకు సరైన గౌరవం ఉండదని.. మనుషుల్లానే చూడరని కామెంట్ చేశాడు. అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారడంతో.. మిగతా జబర్దస్త్ ఆర్టిస్టులు ఆర్పీ వ్యాఖ్యలు కౌంటర్ ఇస్తున్నారు. హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్, షేకింగ్ శేషు వంటి వారు ఆర్పీ వ్యాఖ్యలు అబద్ధం అని చెప్పాగా.. తాజాగా జబర్దస్త్ మాజీ ప్రొడక్షన్ మానేజనర్ ఏడుకొండలు ఈ వివాదంపై స్పందించారు. ఆర్పీపై సంచనల వ్యాఖ్యలు చేశాడు. అంతేకాక జబర్దస్త్‌ను విడిచిపెట్టి బయటకు వెళ్లిన వారి ప్రస్తత పరిస్థితి ఎలా ఉందో చెప్పుకొచ్చాడు ఏడుకొండలు.
ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ.. ‘‘వేరే చానెల్‌లో ఎక్కువ ఇస్తున్నారని బయటకు వెళ్లారు. కానీ ఇక్కడ మీరు పదేళ్ల నుంచి చేస్తున్నారు. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా నిరంతరంగా ఏదో ఒకటి చేస్తూ డబ్బులు ఇస్తున్నారు. 10 ఏళ్ల నుంచి మీరు ఇక్కడ పని చేస్తున్నారు. ఇప్పుడు వేరే చానెల్ వాళ్లు.. ఎక్కువ డబ్బులు ఇస్తున్నామని వెళ్లారు. ఆ సంస్థలు రెండు, మూడేళ్లలో షోలు ఆపేస్తాయి. అప్పుడు పరిస్థితి ఏంటి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు’’ అని చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: షో నుంచి వెళ్లిన వాళ్లంతా తిరిగి రావాల్సిందేనంటున్న జబర్దస్త్ ఏడుకొండలు!
జబర్దస్త్‌ను విడిచి వెళ్లిన చంద్ర పరిస్థితి ఎలా తయారయ్యిందో వివరించాడు ఏడుకొండలు. ‘‘చంద్ర జబర్దస్త్ వదిలి వెళ్లాడు. అక్కడ నుంచి ఓ చానెల్‌కి.. అక్కడ నుంచి మరో చానెల్‌కి వెళ్లాడు. కానీ రేటింగ్ పెరగకపోవడంతో.. పక్కకు పెట్టారు. ఇచ్చిన డబ్బులు న్యాయం చేయకపోతే.. అడగటంలో తప్పులేదు కదా. ఒకప్పుడు వీళ్లు కూడా ఎవరికి తెలియదు. జబర్దస్త్‌కు వచ్చాకే వీళ్లకు గుర్తింపు లభించింది. కొత్త వాళ్లకి అవకాశం ఇస్తే.. ఇప్పుడు వీరికున్న ఫేమ్ వాళ్లకి వచ్చేస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు. మరి ఏడుకొండలు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కిరాక్ RP మొదటి నుండి ఇంతే! ఆరోజు కిరాక్ RPని బయటకి గెంటేశా! : జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు!