ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ నుంచి గత కొంతకాలంగా ప్రముఖ కమెడియన్లు బయటకు వస్తుండటం చూస్తునే ఉన్నాం. ఇటీవలి కాలంలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, అనసూయ సైతం షో నుంచి తప్పుకుంది. అయితే గతంలో షో నుంచి బయటకు వచ్చిన కిరాక్ ఆర్పీ ఆ షో మీద పలు ఆరోపణలు చేయడం చూశాం. ఆ తర్వాత హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ వాటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి జబర్దస్త్ మేనేజర్ గా చేసిన ఏడుకొండలు చేరారు.
జబర్దస్త్ షోపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇస్తానంటూ స్వయంగా ఏడుకొండలు వచ్చి.. సుమన్ టీవీకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో 45 సంవత్సరాల అనుభవం ఉన్న ఏడుకొండలు.. గతంలో జబర్దస్త్ కు కొన్నేళ్లపాటు మేనేజర్ గా చేశారు. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల కారణంగా తాను బయటకు వచ్చేశారు. అయితే ప్రస్తుతం ఆ షోపై వస్తున్న అన్ని ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అవన్నీ తప్పుడు ప్రచారాలంటూ క్లారిటీ ఇచ్చారు.
కిరాక్ ఆర్పీ విషయంలో ఏడుకొండలు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. “అంత కష్ట పడ్డాను ఇంత కష్టపడ్డాను అంటూ చెబుతున్నాడు. మరి అక్కడే ఉండచ్చు కదా.. షోకి ఎందుకు రావాలి. ఆ షో మాకు తల్లితో సమానం అన్నాడు. మరి ఆ తల్లిని ఎందుకు వదిలేసి వెళ్లాడు. షోని వదిలేసి నాలుగేళ్లు అవుతోంది. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు?” అంటూ ఏడుకొండలు ప్రశ్నించారు.
“జబర్దస్త్ షో వల్లే ఎంతో మందికి పేరు, ఫ్యాన్స్ వచ్చారు. ఇప్పుడు వచ్చి ఆ షోపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు. కిరాక్ట్ ఆర్పీ లాంటి వాళ్ల వల్ల షోకి పేరు రాలేదు. ఎంతో మంది కలిసి పనిచేస్తే ఆ షో సక్సెస్ అయ్యింది. అలాగే ఆ షో వల్ల కిరాక్ ఆర్పీ లాంటి వాళ్లు ఎంతో మంది సెలబ్రిటీలు అయ్యారు. ఏనాడు నీకు రెమ్యూనరేషన్ ఆపలేదు. నీకు రావాల్సింది నీకు ఇచ్చారు కదా? మరి ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నావ్?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడుకొండలు పూర్తి ఇంటర్వ్యూని ఈ కింది వీడియోలో చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.