ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ నుంచి గత కొంతకాలంగా ప్రముఖ కమెడియన్లు బయటకు వస్తుండటం చూస్తునే ఉన్నాం. ఇటీవలి కాలంలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, అనసూయ సైతం షో నుంచి తప్పుకుంది. అయితే గతంలో షో నుంచి బయటకు వచ్చిన కిరాక్ ఆర్పీ ఆ షో మీద పలు ఆరోపణలు చేయడం చూశాం. ఆ తర్వాత హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ వాటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
గతంలో చాలాకాలం జబర్దస్త్ షోకి మేనేజర్ గా చేసిన ఏడుకొండలు సుమన్ టీవీకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలు మల్లెమాల, జబర్దస్త్ షోపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై క్లారిటీ ఇస్తానంటూ తానే స్వయంగా వచ్చారు. ఇప్పుడు వస్తున్న ఆరోపణలను ఏడుకొండలు కొట్టిపారేశారు. అవన్నీ అసత్య ప్రచారాలంటూ వ్యాఖ్యానించారు. కిరాక్ ఆర్పీ చేసిన ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం కాదంటూ చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా సుడిగాలి సుధీర్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. “సుధీర్ ని పిలిచి లైఫ్ ఇచ్చాను. అలాంటిది నా ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు. నలుగురు ఫ్యాన్స్, నాలుగు డబ్బులు రాగానే ఎక్కడి నుంచి వచ్చాం అనేది మర్చిపోయారు. నేను ఒకసారి మాల్ ఓపెనింగ్‌కి రామని అడగడానికి చేస్తే తన మేనేజర్ తో మాట్లాడమని చెప్పాడు” అంటూ ఏడుకొండలు తెలిపారు.
అసలు సుధీర్ షో నుంచి ఎందుకు వచ్చేశాడో కనుకున్నారా అని అడగ్గా.. అసలు నా ఫోనే ఎత్తడం లేదంటూ తెలిపారు. అంతేకాకుండా లైవ్ లోనే సుధీర్ కి ఏడుకొండలు కాల్ చేయగా అతను లిఫ్ట్ చేయలేదు. “ఏదో సినిమాల్లో బిజీగా ఉన్నాం అని చెబుతుంటారు. అతను చేసిన ఏ సినిమా ఆడిందో చెప్పమనండి” అంటూ ఏడుకొండలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏడుకొండలు ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏడుకొండలు పూర్తి ఇంటర్వ్యూని ఈ కింది వీడియోలో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.