సెలబ్రిటీల జీవితాల్లో జరిగే చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడానికి కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్‌లోనూ వారు ఎలా ఉంటారు, ఏమేం చేస్తుంటారనే దాన్ని తెలుసుకోవాలనే కుతూహలం అభిమానులు, ఫాలోవర్స్‌లో ఎక్కువగా ఉంటుంది. అందుకే సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎన్నో విషయాలను షేర్ చేస్తుంటారు. సినిమాలు, ప్రోగ్రామ్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో నిత్యం అప్‌డేట్స్ ఇస్తుంటారు. ఏదైనా వెకేషన్‌కు వెళ్లినా, అలాగే ఏవైనా సెలబ్రేషన్స్ తాలూకు వీడియోలు, ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంటారు.
కొందరు సెలబ్రిటీలైతే యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు. యూట్యూబ్‍లో ఓ ఛానెల్ క్రియేట్ చేసుకుని పలు వీడియోలు చేస్తూ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక, జబర్దస్త్ ఫేమ్ వర్ష గురించి తెలిసిందే. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి టెలివిజన్ షోల్లో ఇమ్మాన్యుయేల్‌తో కలసి వినోదాన్ని పండిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారామె. కామెడీతో పాటు అందంతోనూ తాను పాల్గొనే షోలకు మరింత గ్లామర్‌ను అద్దుతున్నారు వర్ష. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వర్ష.. తన నిశ్చితార్థం అయిపోయిందంటూ తాజాగా యూట్యూబ్‌లో ఓ వీడియోను పెట్టి అందర్నీ షాక్‌కు గురి చేశారు.
పెళ్లికొడుకు ఎవరో కూడా చెబుతానంటూ వర్ష ఊరించారు. రాత్రికి రాత్రే ఈ నిర్ణయం తీసుకున్నామని, అంతా హడావుడిగా జరుగుతోందని చెప్పుకొచ్చారు. అందులో తన చీరలు, నగలు, మేకప్ వేసుకునే విధానాన్ని కూడా చూపించారు. దీంతో వీడియో చూసిన వారు నిజంగానే వర్షకు ఎంగేజ్ మెంట్ అయిపోయిందేమోనని అనుకున్నారు. అయితే చివర్లో ఇది తన నిశ్చితార్థం కాదని.. రాకేష్-సుజాతల నిశ్చితార్థం అని రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. జబర్దస్త్ షోతో పాపులరైన వర్ష లాంటి ఆర్టిస్టులకు జనాల్లో మంచి క్రేజ్ ఉంది.
ప్రేక్షకుల్లో తమకు ఉన్న క్రేజ్, పాపులారిటీని ఇలాంటి వీడియోలు చేయడం ద్వారా వాళ్లు పోగొట్టుకుంటున్నారని నెటిజన్స్ అంటున్నారు. సీనియర్ యాక్టర్స్ అయి ఉండి, మెచ్యూరిటీతో ప్రవర్తించకుండా.. పెళ్లి, నిశ్చితార్థం లాంటి సెన్సిటివ్ విషయాలపై ఫన్నీగా వీడియోలు చేయడం ఏంటని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వీడియోల ద్వారా వర్ష లాంటి ఆర్టిస్టులు ప్రజలకు ఏం సందేశాన్ని ఇస్తున్నారని.. పిల్ల చేష్టలను మానుకోవాలంటూ నెటిజన్స్ సూచిస్తున్నారు. మరి, వర్ష తన ఎంగేజ్‌మెంట్ అయిపోయిందంటూ చేసిన ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.