ప్రారంభంలో జబర్దస్త్‌లో లేడీ క్యారెక్టర్ల కోసం మగవారికి ఆగ గెటప్ వేసి స్కిట్ చేసేవారు. కానీ కొన్ని రోజుల తర్వాత జబర్దస్త్‌లోకి ఆడవారిని కూడా తీసుకున్నారు. ప్రస్తుతం జబర్దస్త్‌లో ఫైమా, రోహిణి, గతంలో సత్య ఇలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అప్పుడప్పుడు జబర్దస్త్‌లో మరో అందమైన యువతి కూడా కనిపిస్తుంటుంది. ఆమె షబీనా. సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న షబీనా.. అడపాదడపా జబర్దస్త్‌లో మెరేసిది. అలా ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచుకుంది. ఈ క్రమంలో అభిమానులందరికి స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది షబీనా. తాను పెళ్లి చేసుకోబోతన్నట్లు ప్రకటించింది. అంతేకాక నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేసి అందరికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం షబీనా ఎంగేజ్‌మెంట్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
మున్నా అనే వ్యక్తిని షబీనా వివాహం చేసుకోబోతుంది. సరిగా నెల రోజుల క్రితం అంటే జూలై 17న వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో ఆగస్టు 17 అనగా బుధవారం తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేసింది. వీటితో పాటు తనకు కాబోయే భర్తను కూడా ట్యాగ్ చేసింది. అంతేకాక.. జూలై 17ని ఎన్నటికి మర్చిపోలేనని వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
జబర్దస్త్ కన్నా ముందు షబీనా పలు సీరియల్స్‌లో నటించింది. కస్తూరీ సీరియల్‌లో గ్లామర్ పాత్రలో కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత గృహలక్ష్మి సీరియల్‌లో కొన్ని రోజులు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. ఇక జబర్దస్త్‌లో కెవ్వు కార్తీక్ టీమ్‌లో స్కిట్స్ చేసేది.కెవ్వు కార్తీక్ షబీనా ట్రాక్ వర్కవుట్ చేయడం, మధ్యలో నరేష్ ఎంట్రీ ఇవ్వడం, నరేష్-షబీనా మధ్య లవ్ ట్రాక్ అంటూ కొన్ని రోజులు హల్చల్ చేయడంతో షబీనా ఎక్కువగా పాపులర్ అయింది. ఇక ఆమె పెళ్లి వార్త తెలిసి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.