రీతూ చౌదరి… కామెడీ షో ‘జబర్దస్త్’తో గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయి. షోలో పాత్రకు తగ్గట్టు కనిపించినా… బయట మాత్రం మోడ్రన్ గా కనిపిస్తూ కుర్రకారును ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ షో కు రాకముందు పలు వెబ్ సిరీస్ లో నటించి.. అభిమానులను సొంతం చేసుకుంది. అనంతరం సిరీయల్స్ పలు రకాల పాత్రలు చేస్తూ టెలివిజన్ ప్రేక్షకులకు సుపరిచతమైంది ఈ అమ్మడు. అయితే జబర్ధస్త్ షోలో పాల్గొన్న తరువాత ఓ రేంజ్ లో ఫేమస్ అయింది. మరోపక్క సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రీతూ. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. తాజాగా ఓ ఖరీదైన కారు కొనుగోలు చేసింది ఈ జబర్ధస్త్ బ్యూటీ. దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది.
ఇకపోతే ప్రస్తుతం జబర్ధస్త్ షోలో రీతూ అజర్ తో కలిసి పర్ఫామెన్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరికి జోడీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ రావడంతో రీతూ మంచి గుర్తింపు లభించింది. ఈ విధంగా ప్రతి వారం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఈమె ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఒక స్కిట్ లో భాగంగా ఈ అమ్మడు అజర్ పై ఉన్న లవ్ సీన్స్ చేస్తుంది. ఈక్రమంలో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనా ఈ జోడి జబర్దస్త్ వేదికపై ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో బుల్లితెర నటీమణుల పెద్దఎత్తున ఖరీదైన కార్లను, ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు.
ఇదీ కూడ చదవండి: బ్రహ్మాస్త్రం’ స్పెషల్ వీడియోలో నాగార్జున స్టైలిష్ లుక్..!
ఈ క్రమంలోనే ఎంతోమంది ఇప్పటికే ఖరీదైన కార్లను, ఇళ్లు కూడా కొనుగోలు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. తాజాగా ఈ రీతూ కూడా ఖరీదైన థార్ కారుని కొనుగోలు చేశారు. ఈ కారుతో కలిసి ఈమె దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారాయి. ఎంతో మంది నెటిజన్లు ఈ బ్యూటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.