‘జబర్దస్త్’ ఇమ్మాన్యుయేల్ అనే పేరు చెప్పగానే.. చాలామంది నెటిజన్స్ వర్ష కూడా అని అంటారు. వీళ్లిద్దరి కెమిస్ట్రీ అలాంటిది. ఈ షోలో బాగా పేరు తెచ్చుకున్న జోడీ ఏదైనా ఉందంటే అది సుడిగాలి సుధీర్-రష్మీ మాత్రమే. వాళ్ల తర్వాత షో నిర్వహకులు చాలా జోడీలను కలపడానికి ట్రై చేశారు. కానీ అవేవి పెద్దగా వర్కౌట్ కాలేదు. సుధీర్-రష్మీ అంత ఫేమ్ కాకపోయినా సరే కొంతలో కొంత ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేస్తున్నది ఇమ్ము-వర్ష మాత్రమే. ప్రస్తుతం అన్ని షోల్లోనూ వీళ్ల కెమిస్ట్రీపైనే స్కిట్స్ చేస్తున్నారు. వాటిని చూస్తూ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా పక్కనబెడితే.. రియల్ గా వర్షకి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఇమ్ము ఆశ్చర్యపరిచాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. స్టాండప్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి ‘జబర్దస్త్’లో కమెడియన్ గా సెటిలైన పర్సన్ ఇమ్మాన్యుయేల్. సీరియల్స్ లో నటిస్తూ, ‘జబర్దస్త్’లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడే సెటిలైపోయిన లేడీ కమెడియన్ వర్ష. ఇక కెవ్వు కార్తీక్ టీమ్ లో వీళ్లిద్దరూ మొదట్లో కలిసి పనిచేశారు. అప్పట్లోనే వీళ్ల మధ్య ప్రేమ పుట్టింది! ఆ తర్వాత వీళ్లిద్దరిని బేస్ చేసుకుని చాలా స్కిట్లు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. స్కిట్లు, షోలు పక్కనబెట్టేస్తూ వీళ్లిద్దరూ బయట మంచి ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు వర్షని ఇమ్ము షాపింగ్ కి తీసుకెళ్లాడు.
వచ్చే నెల వర్ష పుట్టినరోజు ఉంది. అంతకంటే ముందే ఆమెని ఇమ్ము.. హైదరాబాద్ లోని ఓ జ్యూవలరీ షోరూంకి షాపింగ్ కి తీసుకెళ్లాడు. ఆ మొత్తాన్ని వ్లాగ్ గా తీసి, తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశాడు. అయితే ఈ వ్లాగ్ అంతా కూడా చాలా ఫన్నీగా ఉండటం విశేషం. ఇక వర్షకి నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చిన ఇమ్ము.. ఆమెపై సెటైర్లు కూడా వేశాడు. ‘గోల్డ్ ఇస్తే ఎక్కువవుతుందని ఇక్కడికి తీసుకొచ్చావా?’ అని వర్ష అడగ్గా.. ‘నీకు గోల్డ్ కూడా ఉందిరా. అది ఇప్పుడు కాదు. మన పెళ్లికి. పెళ్లి షాపింగ్ కూడా చేస్తామండి త్వరలోనే. మా పిల్లల్ని కూడా చూపిస్తాం.’ అని ఇమ్ము జోక్ వేశాడు. దీనికి వర్ష పగలబడి నవ్వింది. ఇకపోతే రీసెంట్ గా కారు కొన్న ఇమ్మాన్యుయేల్.. ఇప్పుడు వర్షకి అదిరిపోయే సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం చూసి నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఇమ్ము ఫుల్ జోష్ లో ఉన్నాడని మాట్లాడుకుంటున్నారు.