జబర్దస్త్.. ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ప్రతిభ ఉండి.. సరైన వేదిక, అవకాశాలు దొరక్క చీకట్లో ఉన్న ఎందరో జీవితాల్లో వెలుగులు నింపింది. అలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో కమెడియన్ ఇమ్మానుయేల్ కూడా ఉన్నాడు. పంచ్‌లతో కడుపుబ్బా నవ్వంచడమే కాక.. రీల్ మీద వర్షతో నడిపే లవ్ ట్రాక్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కామెడీ చేయడం కోసం తన మీద తానే జోకులు వేసుకునేందుకు కూడా రెడీ అవుతాడు. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు జాతి రత్నాలు కూడా చేస్తున్నాడు ఇమ్మానుయేల్. ఈ క్రమంలో తాజాగా ఖరీదైన కారు కొన్నాడు ఈ కమెడియన్. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం అవి వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
జబర్దస్త్ ఇమ్మానుయేల్ కొత్తగా కారు కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇవి వైరలవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఇమ్మానుయేల్ ఫ్రెండ్, ‘జబర్దస్త్’ నటి రోహిణి కూడా ఉంది. హ్యుందై వెన్యూ మైక్రో ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు కారుతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘‘మొత్తానికి నేను కన్న కల నిజమైంది. నా లైఫ్‌లో అనుకోలేదు ఇలాంటి ఒక రోజు వస్తుందని. ఈ మధుర క్షణాలను మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రేమకు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు’’ అని పోస్ట్ చేశాడు. కాగా, ఇమ్మానుయేల్ కొనుగోలు చేసిన కారు విలువ సుమారు రూ.15 లక్షల వరకు ఉంటుంది అని సమాచారం. ఈ ఫోటోలు చూసిన నెటిజనులు అతడికి కంగ్రాట్స్ చెబుతున్నారు.
తమది చాలా పేద కుటుంబం అని.. కానీ సినిమాల మీద ఇష్టంతో హైదరాబాద్ వచ్చానని గతంలో చెప్పాడు ఇమ్మానుయేల్. ఈ క్రమంలో 2017లో ‘పటాస్’ ప్రోగ్రామ్ తొలిసారి బుల్లితెర మీద కనిపించాడు. ఆ షోలో తన టాలెంట్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. జబర్దస్త్ అవకాశం వచ్చింది. 2019లో ‘జబర్దస్త్’లోకి ఎంట్రీ ఇచ్చిన ఇమ్మానుయేల్ ప్రారంభంలో వెంకీ మంకీస్ టీమ్‌లో చేశాడు. తన కామెడీ టైమింగ్, పంచ్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరవాత కెవ్వు కార్తీక్.. బుల్లెట్ భాస్కర్ టీమ్‌లో కూడా చేశాడు. మొత్తానికి ‘జబర్దస్త్’లో అన్ని టీమ్‌లలో చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. వర్షతో రీల్ మీద నడిపే లవ్ ట్రాక్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఇమ్మానుయేల్‌కి విపరీతమైన పాలోయింగ్ ఉంది.