తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న టీవీ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ ఎంటర్టైన్ మెంట్ షోకి సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రతి వారం సరికొత్త ఐడియాలతో, పెర్ఫార్మన్స్ లతో అదరగొడుతున్న ఈ షో నుండి కొత్త ప్రోమో విడుదలైంది. ఈ వారం షోకి జబర్దస్త్ కమెడియన్ రాంప్రసాద్ ఉమ్మడి కుటుంబం హాజరైంది.
ఈ క్రమంలో అంతా సరదాగానే సాగింది. కానీ ఈ ఎపిసోడ్ లో జబర్దస్త్ కమెడియన్ బాబు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఎందుకంటే.. స్టేజిపై మొదటిసారి బాబు తాను ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేసి సర్ప్రైజ్ చేశాడు. ఎంతో కాలంగా మేమిద్దరం ప్రేమలో ఉన్నామని.. తన పేరు అమూల్య అని పరిచయం చేశాడు. అలాగే బాబు రాసిన లవ్ లెటర్ బయట పెట్టింది అమూల్య. ఇద్దరు కూడా బాబుగారు, అమ్ముగారు అని పిలుచుకుంటామని చెప్పారు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ సభ్యులు అందరూ బాబు, అమూల్య జంటకు విషెస్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.