జబర్థస్త్ అప్పారావు ప్రముఖ డిజిటల్ మీడియా సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పటు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ..
జబర్థస్త్ అప్పారావు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దాదాపు 20 ఏళ్లుగా ఆయన చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. 2013లో వచ్చిన జబర్థస్త్ టీవీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన మార్కు కామెడీతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో బిజీబిజీగా గడుపుతున్నారు. గత కొంత కాలంనుంచి ఆయన మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాంటి ఆయన చాలా రోజుల తర్వాత ప్రముఖ డిజిటల్ మీడియా సుమన్ టీవీకీ ఇంటర్వ్యూ ఇచ్చారు.
యూట్యూబ్ ఛానళ్ల ద్వారా సినీ నటులు ఎదుర్కొంటున్న మానసిక క్షోభ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ యూట్యూబ్ వాళ్లందరూ వినాలి. ఎందుకంటే దీని మీద నేనొక నాటిక రాద్దాము అనుకున్నా.. యూట్యూబూ నీకో దండం’. ఎందుకు చెబుతున్నా అంటే.. ఇది నేను కొంచె బాధతో చెబుతున్నా. సుప్రసిద్ధ నటీనటులు బతికి ఉండగానే చంపేస్తున్నారు. థంబ్ నేల్ ఇది పెడితేనే చూస్తారు అనే దాంట్లో ఉంటే దయచేసి నమస్కారం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి.
నో డౌట్. సోషల్ మీడియా ఇప్పుడు బలంగా ఉంది. కాబట్టి నేను అంగీకరిస్తాను. మనిషి బతికుండగా చనిపోయాడు అని చెప్పే అధికారం మీకు ఎవరు ఇచ్చారు. నేను నేరుగా మాట్లాడుతున్నా. ఎవరైనా చనిపోవాల్సిందే. వార్తలు రాసిన వారు కూడా చనిపోవాల్సిందే. లింక్ ఓపెన్ చేయడానికి దారుణమైన కాప్చన్స్ పెట్టకండి. లేనిపోని వన్నీ పెట్టేసి మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేయకండి. పెద్దవారి అందరి తరపునా కోరుకుంటున్నాను’’ అని అన్నారు. మరి, యూట్యూబ్ థంబ్‌నేల్స్‌పై జబర్థస్త్ అప్పారావు ఎమోషనల్ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.