ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, పటాస్, వంటి కార్యక్రమాల ద్వారా ఎందరో కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే వారిలో చాలామంది ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో కష్టాలు అనుభవించారు. ఈ క్రమంలో ఉమెన్స్ డే సందర్భంగా కమెడియన్లు తమ తల్లి, అక్కాచెళ్లల్లతో కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో పటాస్ కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ తన తండ్రిని తీసుకుని శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి వచ్చాడు. ఈ క్రమంలో తన జీవితంలో చోటు చేసుకున్న విషాధ సంఘటనలను శ్రీదేవి డ్రామా కంపెనీ వేదిక మీదుగా వెల్లడించాడు. ప్రవీణ్ మరణించిన తన తల్లిని తల్చుకుని బాధపడ్డాడు. అతడి వేదన చూసి.. ప్రతి ఒక్కరు కన్నీరుపెట్టారు.
ఇది కూడా చదవండి: జబర్దస్త్ మిమిక్రీ మూర్తికి ఏమైంది? ఇలా ఎందుకు అయిపోయాడు?
ప్రవీణ్ తండ్రి మాట్లాడుతూ.. ‘ప్రవీణ్ మూడేళ్లున్నప్పుడే వాళ్ల అమ్మ లివర్ సమస్యతో చనిపోయింది. మూడు నాలుగేళ్లు హాస్పిటల్ చుట్టూ తిప్పాం. రేపోమాపో అన్న పరిస్థితి వచ్చింది. హైద్రాబాద్ నుంచి మా ఊరికి వెళ్లే లోపు చనిపోయింది. ఆ సమయంలో ప్రవీణ్ చాలా చిన్నవాడు. ఆమె మరణించి ఇప్పటికి పదహారేళ్లు. నా భార్య చనిపోయిన తర్వాత నేను మళ్లీ పెళ్లి చేసుకోలేదు. నేను ఒక్కడిని చెడిపోయి అయినా కూడా నా ఇద్దరు పిల్లల్ని బాగు చేద్దామనే ఆలోచనతో మళ్లీ పెళ్లి ఆలోచన చేయలేదు. గత 30 ఏళ్లుగా ఆర్‌ఎంపీగా పని చేస్తూ.. నా బిడ్డలను చూసుకుంటున్నాను. దేవుడు కరుణించాడు’ అని ప్రవీణ్ తండ్రి ఎమోషనల్ అయ్యాడు.
ఇది కూడా చదవండి: ప్రేమ విషయాన్ని బయటపెట్టిన జబర్దస్త్ జంట.. త్వరలోనే పెళ్లి?
‘పెద్దోడిని వెటర్నరీ చేయించాను. కానీ రాష్ట్రాలు విడిపోవడం వల్ల ఉద్యోగం రాలేదు. నా ప్రాక్టీస్‌లో దింపాను. బాగానే సెటిల్ అయ్యాడు. మా చెల్లి కూతురినే ఇచ్చి పెళ్లి చేయించాను. ఇప్పుడు ఆరో నెల. దేవుడి దయ వల్ల అందరం బాగానే ఉన్నాం’ అని ప్రవీణ్ తండ్రి చెప్పుకొచ్చాడు. మా వదిన కడుపులో మా అమ్మ తిరిగి జన్మిస్తుంది అని చెబుతూ ప్రవీణ్ కంటతడిపెట్టాడు. ఇక ఒకానొక సమయంలో తన తండ్రికి ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రికి వెళ్లడానికి పక్కింటి వాళ్లని డబ్బులు అడిగితే.. వారు అన్న మాటలు.. దాంతో తన తండ్రి ఆత్మహత్యాయత్నం చేసిన పరిస్థితులు గురించి చెబుతూ ప్రవీణ్ కంటతడిపెట్టాడు. వారిద్దరిని చూసి ప్రతి ఒక్కరు బాధపడ్డారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.