టాలీవుడ్ ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ బిజీగా బిజీగా ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఓవర్సీస్ లో పలు తెలుగు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ.. మహేశ్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. జనతా గ్యారేజ్, రంగస్థలం మూవీస్ తో ప్రారంభంలోనే హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత స్టార్ హీరోలందరితోనూ దాదాపు సినిమాలు చేస్తూ వస్తున్నారు. రాబోయే సంక్రాంతికి కూడా ఈ సంస్థ నిర్మించిన రెండు మూవీస్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’.. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ ప్లానింగ్ కూడా జరుగుతోంది. తాజాగా ఈ హైదరాబాద్ లోని ఈ సంస్థకు సంబంధించిన ఆఫీసుల్లో ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఉదయం నుంచి ఏకకాలంలో 15 ప్రాంతాల్లో రైడ్స్ జరుగుతున్నాయట. యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని ఇళ్లల్లోనూ అధికారులు తనిఖీ చేస్తున్నారట. దీని గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
@MythriOfficial ఆఫీసులపై ఐటి సోదాలు
— devipriya (@sairaaj44) December 12, 2022