Surya: విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా రిలీజ్ అయ్యాక దర్శకుడు లోకేష్ కనగరాజ్ యూనివర్స్ వెలుగులోకి వచ్చేసింది. నగరం, ఖైదీ, మాస్టర్ సినిమాల తర్వాత తాజాగా విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు లోకేష్. అయితే.. నగరం, ఖైదీ, మాస్టర్ మూడు డిఫెరెంట్ కథలతో తెరకెక్కించిన లోకేష్.. కమల్ హాసన్ తో తీసిన విక్రమ్ కథను మాత్రం ఖైదీతో ముడిపెట్టి అందరి మైండ్ బ్లాక్ చేశాడు.
దీంతో విక్రమ్ సీక్వెల్ లో కార్తీ కంటిన్యూ అవుతాడని క్లారిటీ ఇచ్చేశాడు. కానీ.. చివరలో స్టార్ హీరో సూర్యను.. ‘రోలెక్స్’ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రతో ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే.. విక్రమ్ సీక్వెల్ లో సూర్య విలన్ గా కంటిన్యూ అవుతాడని, రోలెక్స్ గతాన్ని కూడా చూపించనున్నాడని అంతా భావించారు. ఈ క్రమంలో తాజాగా ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్'(LCU) గురించి, రోలెక్స్ రోల్ గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
విక్రమ్ లో సూర్య విలన్ కాగా, ఖైదీలో డిల్లీకి అసలు విలన్ ఒకరున్నారంటూ క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చి వదిలేశారు. ఈ లెక్కన అటు విక్రమ్ 2లో గాని, ఖైదీ 2లో గానీ కామన్ విలన్ సూర్యనే ఉండబోతున్నాడని కామెంట్స్ వినిపించాయి. కానీ.. తాజా సమాచారం ప్రకారం.. రోలెక్స్ గతాన్ని చూపించేందుకు సూర్యతో కంప్లీట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట లోకేష్. అంటే.. సూర్య ఇంత వయోలెంట్ గా మారింది వేరొకరి వల్ల అన్నమాట. దీని ప్రకారం.. సూర్య గతంలో కూడా ఓ పవర్ ఫుల్ విలన్ ఉంటాడు.
ఒకవేళ ఇదే నిజమైతే.. లోకేష్ కనకరాజ్ యూనివర్స్ లో సూర్య కూడా ఓ హీరో అవుతాడు. కానీ.. విక్రమ్, డిల్లీలకు విలన్ కాదని సినీవర్గాల టాక్. లోకేష్ యూనివర్స్ లో అందరూ హీరోలేనని.. కథే విలన్ అని ఇదివరకే చెప్పేశాడు దర్శకుడు. అంటే.. లోకేష్ యూనివర్స్ లో వీలైనంత ఎక్కువమంది హీరోలు పుట్టుకొచ్చే అవకాశం ఉందట. ప్రస్తుతం లోకేష్.. దళపతి విజయ్ తో సెకండ్ మూవీ చేయనున్నాడు. ఆ సినిమా గ్యాంగ్ స్టర్ యాక్షన్ మూవీ అన్నాడు కానీ.. తన యూనివర్స్ లోకి విజయ్ వస్తాడా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు.
ఓవైపు ఫ్యాన్స్, సినీ ప్రేమికులంతా విజయ్ కూడా లోకేష్ యూనివర్స్ లో జాయిన్ అవుతాడని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా విజయ్ కూడా లోకేష్ యూనివర్స్ చేరితే మాత్రం.. వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. కానీ.. లోకేష్ ఎలాంటి ప్లాన్ లో ఉన్నాడో తెలియాల్సి ఉంది. మరి విక్రమ్ 2 లేదా ఖైదీ 2లో రోలెక్స్ విలన్ గా కంటిన్యూ అవుతాడా లేదా? అనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#RolexSir from #Vikram pic.twitter.com/C6JC9g6sFZ
— VijaySethupathi (@VijaySethuOffl) June 19, 2022
R O L E X S I R 😎🔥@Suriya_offl #RolexSir #Rolex pic.twitter.com/4r6V6KGjrR
— Behindwoods (@behindwoods) June 20, 2022
After #RockyBhai now there is a lot of talk about #Rolex‘s character. #LokeshKanagaraj has not only created his own universe through #Vikram but has also filled a new energy among cinema lovers. People are eager to know everything related to #Suriya‘s Character.#VikramHitlist pic.twitter.com/VxnvgJvwx3
— Divyaman Yati (@YatiDivyaman) June 9, 2022