కాస్టింగ్ కౌచ్.. సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపించే పేరు ఇది. స్టార్ హీరోయిన్స్ నుంచి క్యారెక్టర్ అర్టిస్ట్‌ల వరకు ఎంతో మంది దీని బాధితులుగా ఉన్నారు. అయితే ‘మీటూ’ ఉద్యమం తర్వాత సినీ పరిశ్రమలో తమకు ఎదురైన లైంగిక వేధింపులపై చాలామంది నోరు విప్పారు. స్టార్ హీరోయిన్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల వరకు ధైర్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. తాజాగా అక్కినేని నాగార్జునతో కలిసి చంద్రలేఖలో నటించిన ఇషా కొప్పికర్ కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిందట.
90వ దశకంలో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ఈ అందాలతార ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లు చేస్తోంది. 2009లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన ఆమె..నిఖిల్ హీరోగా వచ్చిన ‘కేశవ’ సినిమాలో కీ రోల్ పోషించి రీఎంట్రి ఇచ్చింది. ఈ సందర్భంగా సినిమా కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ఇషా గుర్తు చేసుకుంది. ‘మా కుటుంబంలో ఎక్కువమంది డాక్టర్లే. అయితే కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో పాకెట్ మనీ కోసం నేను మోడలింగ్‌లోకి అడుగుపెట్టా. ఈ క్రమంలో ‘ఏక్ థా దిల్ థా ధడ్కన్’ ఆఫర్ రావడంతో హీరోయిన్ అయ్యాను.
ఓ కొత్త నిర్మాత నుంచి నాకు కాల్ వచ్చింది.. తాను మాట్లాడుతూ ‘మేము చేస్తున్న సినిమాలో మిమ్మల్ని హీరోయిన్‌గా అనుకుంటున్నాం. మా హీరోకీ మీరు బాగా నచ్చేశారు. వీలుంటే ఒక్కసారి ఆయన్ని కలవండి’ అని ఆయన చెప్పాడు. ఆ తర్వాత హీరోకి కాల్ చేస్తే ‘మీరు ఒంటరిగా రండి. ఏకాంతంగా కలుద్దాం. మీతో పాటు మీ స్టాప్ ఎవరు ఉండకూడదు’ అని చెప్పుకొచ్చింది. అప్పుడు అర్థమైంది.. ఆ హీరో తనని ఎందుకు ఒంటరిగా రమ్మన్నాడో.. ఛీ ఇండస్ట్రీలో టాలెంట్ కి విలువ ఇవ్వరా అన్న బాధ కలిగింది. తర్వాత నిర్మాతకు ఫోన్ చేసి ‘నా ట్యాలెంట్ ఆధారంగా చేసుకుని ఆఫర్స్ వస్తే చేస్తాను’ అని గట్టిగా చెప్పేశాను. దీంతో ఆహీరోని కలవలేదనే కారణంతోనన్ను ఆ ప్రాజెక్ట్ నుంచి తీసేశారు’ అని అప్పటి చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది ఇషా.