సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ స్టార్‌డమ్ వచ్చిన తర్వాత లభించే క్రేజ్ ఎంత ఘనంగా ఉంటుందో.. గుర్తింపు రావడానికి అంతకన్నా ఎక్కువే కష్టపడాలి. ఎన్నో అవమానాలను ఎదుర్కొవాలి. నటీమణులకు ఈ ఇబ్బందులు కాస్త ఎక్కువే అని చెప్పవచ్చు. మీటూ ఉద్యమం వెలుగులోకి వచ్చిన తర్వాత చాలా మంది తమకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించారు. ఈ జాబితాలో ప్రముఖ హీరోయిన్ ఇషా కొప్పికర్ కూడా ఉన్నారు. క్యాస్టింగ్ కౌచ్ వల్ల తనకు సినిమా అవకాశం కూడా చేజారిపోయిందని చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: చరణ్ కాబట్టి రిస్క్ తీసుకున్నాడు.. నేనైతే వద్దనే వాడ్ని: చిరంజీవి
తాజాగా బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషా కొప్పికర్ మాట్లాడుతూ దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడించింది… ‘యాక్టర్స్‌గా ఎలా కనిపిస్తున్నాము? ఎలా నటిస్తున్నామనేదే ముఖ్యమనుకున్నాను. కానీ కొందరు హీరోల కంట్లో కూడా ఉంటామని తర్వాత తెలిసింది. ఆ రోజు జరిగిన సంఘటనతో నా హృదయం ముక్కలైంది. అందరికీ వారికంటూ కొన్ని ప్రాధాన్యతలుంటాయి. అలా నాకు నా వర్క్ కంటే జీవితమే ముఖ్యమైనది. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు తలెత్తుకునేలా ఉండాలి’ అని చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి : మంచు విష్ణు కోసం పరోటాలు చేసిన సన్నీలియోన్! వీడియో వైరల్!కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇషా మాట్లాడుతూ.. ‘ఓ నిర్మాత ఫోన్ చేసి ఓ హీరో రాసుకున్న లిస్టులో మీరు కూడా ఉన్నారని చెప్పాడు. నాకర్థం కాక హీరోకు ఫోన్ చేస్తే అతడు ఒంటరిగా రమ్మన్నాడు. నా స్టాఫ్ ఎవరూ కూడా వెంట రావద్దని మరీ మరీ చెప్పడంతో విషయం అర్థమైంది. అప్పుడు నిర్మాతను పిలిచి నా అందం, పనితనం వల్లే ఇక్కడిదాకా వచ్చాను, అలాంటిది ఇప్పుడు ఓ అవకాశం కోసం దిగజారతానని ఎలా అనుకున్నారని కడిగిపారేశాను. దీంతో అతడు నన్ను సినిమా నుంచి తప్పించాడు’ అని చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: ‘‘జెర్సీ’’ సినిమాకు మూడేళ్లు.. ట్రెండింగ్‌లో డిలేటెడ్ వీడియో..
ఏక్ థా దిల్ ఏక్ థీ దడ్కన్ సినిమాతో కథానాయికగా 1998లో కెరీర్ ఆరంభించిన ఇషా ఫిజా, ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్, కంపెనీ, పింజర్, దిల్ కా రిష్తా వంటి పలు చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా తెలుగులో చంద్రలేఖ, ప్రేమతో రా వంటి సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పించింది. ఆమె చివరగా దహనం వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఇషా కొప్పికర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.