మొన్నటి వరకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ గా ఉన్న శర్వానంద్ సైతం.. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూధన్ రెడ్డి కుమార్తె రక్షితా రెడ్డితో 5 నెలల క్రితం నిశ్చితార్థం చేసుకుని ఆ జాబితా నుండి బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే వీరిద్దరూ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ లిస్ట్ తీస్తే చాంటాడంత ఉంటుంది. మూడు పదుల వయస్సు దాటినా కూడా ఇంకా పెళ్లి ఊసేత్తడం లేదు కొందరు. అయితే వడివడిగా హీరోలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. మొన్నటి వరకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ గా ఉన్న శర్వానంద్ సైతం.. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూధన్ రెడ్డి కుమార్తె రక్షితా రెడ్డితో కొన్ని నెలల క్రితం నిశ్చితార్థం చేసుకున్న సంగతి విదితమే. అయితే ఎంగేజ్‌మెంట్ జరిగి 5 నెలలు గడుస్తున్నా.. పెళ్లి పీటలు ఎక్కకపోవడంతో నిశ్చితార్థం క్యాన్సిల్ అంటూ వార్తలు వినిపించాయి. అయితే దీనిపై శర్వానంద్ టీమ్ స్పందించినట్లు తెలుస్తోంది.
శర్వానంద్ , రక్షితా రెడ్డి ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారని సోషల్ మీడియాలో వార్త వైరల్ అయ్యింది. దీంతో అభిమానులు సైతం చాలా బాధపడ్డారు. అయితే ఈ వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ‘ శర్వా,రక్షితా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్‌లో శర్వా బిజీగా ఉన్నారు. 40 రోజుల పాటు లండన్‌లో షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకొని.. కొన్ని రోజుల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చాడు. పెళ్లికి ముందు వర్క్ కమిట్మెంట్ పూర్తి చేయాలనుకున్నాడు. తర్వాత పూర్తిగా వివాహంపై ఫోకస్ పెడతానని చెప్పారు. అలాగే ఇద్దరి కుటుంబాలు హైదరాబాద్‌లోనే ఉన్నారని, వారే కలుసుకుని మ్యారేజ్ తేదీని ఫైనల్ చేస్తారు’అని టీమ్ తెలిపింది.
చిన్న చిన్న క్యారెక్టర్లతో సినిమా కెరీర్‌ను మొదలు పెట్టారు శర్వా. గౌరీ, శంకర్ దాదా ఎమ్ బిబిఎస్, సంక్రాంతి, లక్ష్మి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. అనంతరం అమ్మ చెప్పింది, వీధి, గమ్యంతో హీరోగా మారాడు. గమ్యం సక్సెస్ తో వరుసగా సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అందరి బంధువయ్యా, ప్రస్థానంతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేసినా డిజాస్టర్ గా మిగిలాయి. రన్ రాజా రన్, శతమానం భవతి మినహాయించి మిగతావి ఏదో సోసో అనిపించాయి. అయితే గత ఏడాది విడుదలైన అమ్మ సెంటిమెంట్ సినిమా ఒకే ఒక జీవితంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు.