టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలంటే..హీరోయిన్స్ కూడా పేరు మోసిన లేదా లక్కీ డైరెక్ట్రర్, హీరో ద్వారా పరిచయమవ్వాలి అనుకుంటుంటారు. అటువంటి లక్కీ డైరెక్టర్లలో ఒకరు తేజ. ఎక్కువగా కొత్త వారితోనే సినిమాలు చేస్తారు తేజ. అందులో చాలా మంది స్టార్ స్టేటస్‌ను పొందిన వారే.
సినిమా రంగంలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా వరించాలి. అందుకే హీరో, హీరోయిన్లు లక్కీ డైరెక్టర్ కానీ నిర్మాతలతో పని చేయాలనుకుంటారు. సినిమా పరిశ్రమలో కొంత మంది దీన్ని విశ్వసిస్తారు కూడా. అందుకే వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ను నటుడిగా తీర్చిదిద్దే బాధ్యతలను రాఘవేంద్ర రావుకు అప్పగించారు తల్లిదండ్రులు. అలాగే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలంటే..హీరోయిన్స్ కూడా పేరు మోసిన లేదా లక్కీ డైరెక్ట్రర్, హీరో ద్వారా పరిచయమవ్వాలి అనుకుంటుంటారు. అటువంటి వారిలో ఒకరు తేజ (పరిశ్రమ భావిస్తుంది). ఎక్కువగా కొత్త వారితోనే సినిమాలు చేస్తారాయన. అందులో చాలా మంది స్టార్ స్టేటస్‌ను పొందిన వారే. ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ వీరందరినీ తెలుగు తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ తేజనే. అలాగే హీరోయిన్ల విషయంలో ఆయనది చాలా లక్కీ హ్యాండనే చెప్పాలి. కాజల్ అగర్వాల్, రీమాసేన్, సదాను ఆయన పరిచయం చేశారు. వీరంతా చాలా బాగా పేరు తెచ్చుకున్నారు.
ఇప్పుడు అహింస అంటూ కొత్త జంటతో రాబోతున్నారు తేజ. సురేష్ బాబు చిన్న కొడుకు, నటుడు రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో అందం తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఆమె పేరు గీతికా తివారీ. తేజ సినిమాల్లో అమ్మాయిలను గడుసుగా, ఉన్నంతగా చూపిస్తారు కూడా. తేజ స్కూల్ నుండి వస్తున్న అమ్మాయి కావడంతో ఆమెపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ కు చెందిన అమ్మాయి గీతిక. గ్రాడ్యూయేషన్ చేసింది. సినిమాల మీద ఇంట్రెస్ట్ తో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు ప్రకటనల్లో చేసింది. హీరో నాగార్జునతో కలిసి ఓ ప్రకటన చేసిందీ కూడా. ఆ సమయంలో దక్షిణాది సినిమాల్లో ప్రయత్నించాలని ఆయన సలహా ఇచ్చారని ఓ సారి ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
అయితే ఆమె తొలుత శరవణ స్టోర్ అధినేత శరవణన్‌తో ‘ది లెజెండ్’లో తళుకున్న మెరిసింది. ఆ సినిమాలో హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు తెలుగులో తేజ దర్శకత్వంలో పరిచయం కాబోతుంది. దర్శకుడు తేజ కొత్తమ్మాయి కోసం చూస్తున్నాడని తెలిసి, హైదరాబాద్ వచ్చి ఆడిషన్ ఇచ్చింది. అలా అహింస ప్రాజెక్టులోకి ఎంటరైంది. తేజ సినిమాల్లోని మిగతా అమ్మాయిల క్యారెక్టర్ మాదిరిగానే.. అహింస సినిమాలో కూడా తనది గడుసైన అమ్మాయి పాత్ర అంటోంది గీతిక. కొన్ని సందర్భాల్లో హీరోకు దిశానిర్దేశం చేసే ఛాయల్లో కూడా కనిపిస్తుందట గీతిక పోషించిన అహల్య పాత్ర. ఆయనదీ లక్కీ హ్యాండ్ అని, తేజ సినిమాల ద్వారా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. వచ్చే నెల 2న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. మరీ తేజ ఆమెకు ఎంత లక్కీ హ్యాండో ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది.