జబర్దస్త్ షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏళ్ల తరబడి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. దీనికి పోటీగా మిగతా చానెల్స్ ఎన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేసినా.. జబర్దస్త్‌ను మాత్రం ఢీ కొట్టలేకపోయాయి. ఈ షో ద్వారా ఎందరో ప్రతిభావంతులకు తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం లభించింది. కొన్నెళ్ల పాటు టెలివిజ్ ఇండస్ట్రీలో టాప్ రేటింగ్‌తో ముందంజలో ఉన్న జబర్దస్త్ కార్యక్రమం ప్రస్తుతం వెలవెలబోతుంది. దీనికి కారణం.. కీలక సభ్యులంతా బయటకు క్యూ కడుతుండటంతో ఫన్ జనరేట్ చేసే కంటెంట్ తగ్గింది. ఈ ప్రభావంతో రేటింగ్‌లో కూడా అంతకంతకూ వెనకబడిపోతుంది జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్. ఇక కొన్ని రోజుల నుంచి జబర్దస్త్‌కు సంబంధించి పలు వార్తులు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జబర్దస్త్‌కు సంబంధించి ప్రస్తుతం ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. అది ఏంటంటే.. సుధీర్ జబర్దస్త్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఆ వార్తల సారాంశం. ఆ వివరాలు..
సుధీర్ జబర్దస్త్‌లోకి రీ ఎంట్రీ అంటూ వార్తలు రావడానికి ప్రధాన కారణం.. జూలై 24న ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రా కంపెనీకి సంబంధించిన ఎసిసోడ్ ప్రోమో. దీనిలో ముఖ్యంగా రష్మి బయోని హైలెట్ చేశారు. దీనిలోనే చివర్లో ఓ అభిమాని చేత సుధీర్ ఎందుకు జబర్దస్త్ విడిచి బయటకు వెళ్లాడు.. ఆది కూడా వెళ్లిపోబోతున్నాడా వంటి ప్రశ్నలు అడిగించి.. వాటికి సమాధాలను ఇచ్చే ప్రయత్నం చేశారు. అతను అడిగిన ప్రశ్నలకు హైపర్ ఆది సమాధానం చెప్తుండగా.. మ్యూట్ చేశారు. మరి ఇంతకు ఆది ఏం రిప్లై ఇచ్చాడు సుధీర్ జబర్దస్త్‌కు తిరిగి వస్తాడా రాడా తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ ప్రచారం అయ్యే వరకు ఆగాల్సిందే.
కానీ ప్రోమో చూసిన జనాలు మాత్రం.. సుధీర్ రీ ఎంట్రీ పక్కా అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అసలు ఆది ఏం మాట్లాడాడో అర్థం కాకుండానే.. జబర్దస్త్‌లోకి సుధీర్ రీ ఎంట్రీ జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరి ఈ పుకార్లపై కార్లిటీ రావాలంటే ఆదివారం వరకు వేచి ఉండాల్సిందే. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.