కోయిలను మించిన తీయని స్వరంతో ఏళ్లుగా అభిమానులను అలరిస్తోంది సింగర్ సునీత. సినిమాల్లో పాటలు పాడటమే కాక.. పలువురు హీరోయిన్లకు.. సునీత డబ్బింగ్ చెబుతారు. ఇక తీయని స్వరమే కాక.. అందమైన రూపం సునీత సొంతం. సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ అన్ని కలిపి వందల పాటలు పాడారు సునీత. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు సునీత. వెకేషన్స్, ఇంట్లో శుభకార్యాలు, పిల్లలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు సునీత. తాజాగా వచ్చిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1లో ఐశ్వర్యకు డబ్బింగ్ చెప్పారు సునీత. ఇప్పటి వరకు తెర మీద సునీత వాయిస్ మాత్రమే విన్నాం. కానీ అతి త్వరలోనే.. ఆమెను తెర మీద చూడబోతున్నాం. ఇన్నాళ్లు సింగర్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సునీత.. ఇక నటిగా రాణించేందుకు సిద్ధమవుతున్నారంటూ ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో సునీత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఆ వివరాలు..
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకతంలో ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి #SSMB 28 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ క్రమంలో సినిమాలో మహేష్ అక్క పాత్ర కోసం.. త్రివిక్రమ్.. సింగర్ సునీతను తీసుకోవాలని భావించారట. ఈ విషయాన్ని మహేష్‌బాబుకు చెప్పగా.. ఆయన కూడా సరే అన్నారంట. ఆ తర్వాత త్రివిక్రమ్.. ఇదే విషయమై సింగర్ సునీతను కలవడం.. పాత్ర గురించి చెప్పడంతో.. ఆమె కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ వార్తలు నిజమైతే.. సునీత అభిమానులు పండగ చేసుకుంటారు. ఇప్పటి వరకు తెర మీద కేవలం సునీత గొంతు మాత్రమే వినిపించింది. ఒకవేళ ఈ వార్త నిజమయ్యి.. ఆమె మహేష్ బాబు సినిమాలో నటిస్తే.. తెర మీద ఆమెను చూడవచ్చు. ఇప్పటి వరకు సునీత కొన్ని యాడ్స్‌లో యాక్ట్ చేసింది కానీ.. సినిమాల్లో నటించలేదు. కానీ ఇప్పుడు ఆమె నటిగా మారితే.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. త్రివిక్రమ్ సినిమాలో.. మహేష్‌కు అక్కగా సునీత కనిపిస్తే.. ఆ కాంబో సినిమాకే హైలెట్ అవుతుంది అంటున్నారు ఈ వార్త విన్న అభిమానులు. మరి ఈ వార్తల్లో ఏ మేరకు నిజం ఉందో తెలియాలంటే.. కొన్ని రోజులు వేచి చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన.. బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.