టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. గత కొన్నేళ్లుగా వరుస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టెంపర్ నుండి ఇటీవలి RRR మూవీ వరకు డిఫరెంట్ బాడీలాంగ్వేజ్ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇకపై చేయబోవు సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే.. RRR తర్వాత ఎన్టీఆర్ 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.
ఇదివరకే వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం అద్భుతమైన విజయం అందుకుంది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ కాంబోలో రెండో సినిమా అనౌన్స్ చేసేసరికి ఫ్యాన్స్ లో అంచనాలు భారీస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్ విషయంపై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొన్నటివరకూ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ జోడి కట్టనుందని భావించారు. కానీ ఇటీవల ఆమె పెళ్లి చేసుకోవడంతో సినిమాలో నటించట్లేదని తేల్చేసింది.
ఈ నేపథ్యంలో దర్శకుడు కొరటాల ఎన్టీఆర్ కోసం స్టార్ హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ సరసన జతకట్టనున్న హీరోయిన్ ఎవరో కాదు.. నేచురల్ బ్యూటీ సాయిపల్లవి అని సమాచారం. ఎన్టీఆర్ ఎనర్జీకి సాయిపల్లవి అయితేనే బాగుంటుందని భావించి కొరటాల ఆల్రెడీ ఆమెను సంప్రదించాడట. అయితే.. కొరటాల చెప్పిన స్క్రిప్ట్ కి సాయిపల్లవి కూడా సానుకూలంగా స్పందించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ‘NTR-30’ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి ఎన్టీఆర్ – సాయిపల్లవి కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.