RRR సినిమా విజయంతో మరోసారి తనకు సాటి లేదని.. నిరూపించుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసే పనిలో ఉంది. ఇద్దరు స్టార్ హీరోలను తీసుకుని.. వారి అభిమానుల అంచనాలకు ఏమాత్రం తక్కువ కాకుండా సినిమాను తెరకెక్కించడంలో జక్కన్న సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం RRR టీమ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో ఉండనుంది అని రాజమౌళి గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ వినిపిస్తోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: RRR పై అసంతృప్తి.. జక్కన్నను అన్‌ఫాలో చేసిన హీరోయిన్!
RRRతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కించిన రాజమౌళి తన తదుపరి సినిమా మహేష్ బాబుతో అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే RRR కన్నా ఎక్కువ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ స్థాయిలో మహేష్ బాబుతో సినిమా తీయనున్నారనే వార్తలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే ఇది అడవి బ్యాక్‌డ్రాప్‌తో రాబోతున్న కథగా ఆయన తెలిపారు. కాగా గతంలో రాజమౌళి మహేష్ బాబుతో జేమ్స్ బాండ్ తరహా చిత్రాన్ని తెరకెక్కిస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు నిజంగానే మహేష్ బాబుతో.. హాలీవుడ్ రేంజ్‌లో.. అడవి బ్యాక్‌డ్రాప్‌లో జేమ్స్ బాండ్ సినిమాను జక్కన్న రెడీ చేస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
ఇది కూడా చదవండి: తెరమీదకు RRR 2.. జక్కన్న మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడా..?అంతేగాక ఈ సినిమా కోసం దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించనున్నారట చిత్ర యూనిట్. దీంతో ఈ సినిమా హాలీవుడ్ చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా ఉండబోతుందని, ఈ సినిమాను ఇండియన్ భాషలతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమాను నిజంగానే జేమ్స్ బాండ్ తరహా చిత్రంగా జక్కన్న తెరకెక్కిస్తాడా అనేది తెలియాలంటే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.