ఆర్ఆర్ఆర్.. దర్శకదిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా పీరియాడిక్ బ్లాక్ బస్టర్.. బాక్సాఫీస్ వద్ద విడుదలై ఎనిమిది నెలలు కావస్తోంది. అయినా ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. జనాలు కూడా ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అందుకు కారణం ఆర్ఆర్ఆర్ సినిమా ఈ ఏడాది మార్చిలో ఒకేసారి విడుదలైనప్పటికీ, ఇప్పుడు ఒక్కో భాషలో రిలీజ్ అవుతుండటం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా.. ఇతర స్టార్ కాస్ట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో రూ. 1150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పుడీ సినిమా అటు జపనీస్ భాషలోకి అనువాదమై రిలీజ్ అయ్యింది. మరోవైపు చికాగోలో రిలీజ్ చేసే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దర్శకుడు రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ మూవీకి సీక్వెల్ ఉంటుందని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అసలు రాజమౌళి ఏ విధంగా ఆర్ఆర్ఆర్ కి సీక్వెల్ అనౌన్స్ చేశాడు? ఈ సినిమాలోనే ఆల్రెడీ ఇద్దరు హీరోలతో కథకు ఎండింగ్ ఇచ్చాడు కదా..? అదీగాక తన తండ్రి విజయేంద్రప్రసాద్ ఆర్ఆర్ఆర్ కి సీక్వెల్ స్టోరీ సిద్ధం చేస్తున్నాడని చెప్పాడు.. ఇదంతా జరిగే పనేనా? అనే సందేహాలు ఒక్కసారిగా అటు ఇండస్ట్రీ వర్గాలలో, సినిమా లవర్స్ లో మైండ్ లోకి వచ్చాయి.
ఆర్ఆర్ఆర్ సినిమానే ఓ ఫిక్షన్ స్టోరీ అని.. రెండు పవర్ ఫుల్ ఫ్రీడమ్ ఫైటర్స్ క్యారెక్టర్స్ ఆధారం చేసుకొని తీశాడు రాజమౌళి. అదీగాక ఈ సినిమాతోనే హీరోల క్యారెక్టరైజేషన్స్, కథ పరంగా ఎన్నో విమర్శలు ఫేస్ చేశాడు. ఇలాంటి నేపథ్యంలో రాజమౌళి ఏ ధైర్యంతో ‘ఆర్ఆర్ఆర్ 2’ అనౌన్స్ చేశాడు. మరోవైపు ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ తదుపరి సినిమాలను లైనప్ చేసుకొని కమిట్మెంట్ ఇచ్చి ఉన్నారు. మరి ఈ హీరోల డేట్స్ మళ్లీ ఒకేసారి దొరకడం సాధ్యమేనా? రాజమౌళి దగ్గర కథ పరంగా చెప్పడానికి ఇంకేం పాయింట్ ఉంది? కథపరంగా ఆర్ఆర్ఆర్ ఫేస్ చేసిన విమర్శలను, విమర్శకులను మెప్పించాల్సి ఉంటుంది.
ఇవన్నీ సాధ్యమేనా? అన్ని అసాధ్యాల మధ్య రాజమౌళి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ అనౌన్స్ చేయడం వెనుక మరో కారణం ఉందని అంటున్నారు. ఇప్పుడు జపాన్ తర్వాత ఆర్ఆర్ఆర్ చికాగోలో రిలీజ్ కాబోతుంది కదా.. అక్కడ పబ్లిక్ అటెన్షన్ కోసమే అలా చెప్పాడని.. ఇదంతా పబ్లిసిటీ స్ట్రాటజీ అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి సీక్వెల్ అనౌన్స్ మెంట్ అనేది.. ఆర్ఆర్ఆర్ ని ఇంకా జనాల్లో హోల్డ్ చేయడానికేనా అని భావిస్తున్నారు. సరే ఇదంతా నిజమే. రాజమౌళి నిజంగానే ఆర్ఆర్ఆర్ 2 తీస్తాడు అనుకుంటే.. అది జరిగేది ఎప్పుడు? ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు రాజమౌళి కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ 2 ఉంటుందని.. ఆల్రెడీ కథ రాస్తున్నారని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ తో భారీ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత వేరే సినిమా చేయనున్నాడు. ఎన్టీఆర్ విషయానికి వస్తే.. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లతో కమిట్ అయ్యాడు. ఇటు రాజమౌళి.. మహేష్ బాబుతో గ్లోబ్ ట్రోటింగ్ జానర్ లో యాక్షన్ అడ్వెంచర్ ప్రకటించాడు. ఇక మహేష్ బాబు.. త్రివిక్రమ్ తో సినిమా అయ్యాకే రాజమౌళి సినిమాలో జాయిన్ అవుతాడు. సో.. ఇన్ని కమిట్మెంట్స్ మధ్య రాజమౌళి ఇంకా మహేష్ సినిమా స్క్రిప్టు పనులే పూర్తి చేయలేదు. మహేష్ సినిమానే ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. అలాంటప్పుడు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ అనేది అసాధ్యమని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు.
#RRR2 Script work Going On 💥💥💥💥#ManofMassesNTR || @tarak9999pic.twitter.com/U14y8BntB4
— Nellore NTR Fans (@NelloreNTRfc) November 13, 2022
#RRR2 Discussions Are Going On 💥🔥#RRRMovie #JrNTR #RamCharan pic.twitter.com/x2myRygFRY
— Fukkard (@Fukkard) November 13, 2022