పాన్ ఇండియా సూపర్ స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డార్లింగ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాహుబలి 2 తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కొట్టకపోవడంతో ఇప్పుడు ప్రభాస్‌తో పాటు ఫ్యాన్స్ కూడా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అందరి ఆశలు ఆదిపురుష్ పైనే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత ఎక్కువ అంచనాలు ఉన్న సినిమాలు రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ కాగా, రెండు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే. ఈ రెండు సినిమాల మీద ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. 2023లో ప్రభాస్ మూడు సినిమాలతో ఫుల్ ట్రీట్ ఇవ్వనున్నారని సంబరపడుతున్నారు.
ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా.. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. డార్లింగ్ ప్రభాస్ ఏక కాలంలో రెండు షూటింగుల్లో పాల్గొంటున్నారు. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కేకి సంబంధించి క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుందని, స్టోరీ పెద్దగా ఉండడంతో రెండు భాగాలుగా విభజించినట్టు వార్తలు వస్తున్నాయి.
సలార్ కూడా కేజీఎఫ్‌లానే రెండు భాగాలుగా తెరకెక్కుతుందని ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అభిమానులు కూడా రెండు భాగాలుగా తెరకెక్కితేనే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్ చూసినా, బాహుబలి చూసినా రెండు భాగాలుగా తెరకెక్కి ఘన విజయాన్ని సాధించాయని, సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని అంటున్నారు. మరి ప్రాజెక్ట్ కే సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
Project K: Prabhas & Deepika Padukone Starrer Sci-Fi Film To Be Divided Into Two Parts? Find Out#prabhas #deepikapadukone #projectk #southindiancinema #koimoi https://t.co/lV1SSs1aab
— Koimoi.com (@Koimoi) August 16, 2022