పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ని సాహోతో కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత వచ్చిన లవ్ స్టోరీ రాధేశ్యామ్ నిరాశపరిచినప్పటికీ, సాలిడ్ లైనప్ తో బాక్సాఫీస్ పై దాడికి రెడీ అయిపోయాడు. ఆదిపురుష్ లాంటి మైథాలజీ మూవీ తర్వాత.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ మాఫియా యాక్షన్ జానర్ లో ‘సలార్’ మూవీ, మారుతీతో ఓ సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు పాన్ వరల్డ్ మూవీగా ‘ప్రాజెక్ట్ K‘ చేస్తున్నాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా సూపర్ హీరో కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఈ సినిమాని రూపొందిస్తున్నాడు.
ఈ సినిమాని అంతే భారీ స్థాయిలో సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్ తో వైజయంతి బ్యానర్ లో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ డార్లింగ్ ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ లోకి చేరుకున్నాయి. విజువల్ గా వండర్స్ సృష్టించబోతుందని ఇప్పటిదాకా రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ సినీ వర్గాలలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కే మూవీని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించి షూటింగ్ పార్ట్ అయిపోయిందని.. ఆ ఫస్ట్ పార్ట్ నే వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రాజెక్ట్ కే రెండు భాగాలు అవునా కాదా? అనేది మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే.. ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఇక ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ కాగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్, బ్యూటీ దిశా పటాని కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక ప్రాజెక్ట్ కే మూవీకి మిక్కీ జే. మేయర్ సంగీతం.. డానీ శాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి ప్రభాస్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. చూడాలి మరి.. ప్రాజెక్ట్ కే టీమ్ నిజంగానే సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుందా అనేది వేచి చూడాలి. మరి ప్రాజెక్ట్ కే మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
You know what I mean 😉#ProjectK Releasing in Two Parts ✌️
Part 1 Shoot Wrapped up and Aiming for April 2024 Release 🔥#Prabhas #ProjectK pic.twitter.com/kv1tIXSCOl
— Roaring REBELS (@RoaringRebels_) February 1, 2023
#ProjectK Releasing in 2 Parts 👍#Prabhas pic.twitter.com/hnyxpOMOJE
— OUR TOLLYWOOD TALKS (@OurTollyTalks) February 1, 2023
#ProjectK According to the source, the shooting for part one is already wrapped up and the team is at present shooting for the second part of Project K. “Both the parts are being shot in one go and the two in a short interval of less than a year.🔥🔥⚡ pic.twitter.com/kQdhFkGAky
— Asif (@BoyasifSolo) February 1, 2023