Prabhas: ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ ని దక్షిణాదిలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలనే చెప్పాలి. బాహుబలి, సాహోలతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించి బాలీవుడ్ లో పాగా వేశాడు ప్రభాస్.. ఆ తర్వాత కేజీఎఫ్ తో కన్నడ స్టార్ యష్, పుష్పతో అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్నారు. అయితే.. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యి వసూళ్ల వర్షం కురిపించినప్పటికీ.. దేశవ్యాప్తంగా ఫ్యాన్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో కేజీఎఫ్ తర్వాతే ఏదైనా అని చెప్పవచ్చు.
ఈ ఏడాది కేజీఎఫ్ 2 మూవీతో యష్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించారు. కేవలం 300కోట్ల బడ్జెట్ పెట్టి, 600 కోట్ల షేర్ కొల్లగొట్టారు కేజీఎఫ్ టీమ్. అదీగాక కేజీఎఫ్-2 సినిమాతోనే సిరీస్ అయిపోయిందని అనుకుంటున్న ఫ్యాన్స్ కి క్లైమాక్స్ లో ‘కేజీఎఫ్ చాప్టర్ 3‘ అనౌన్స్ చేసి అందరికీ మర్చిపోలేని మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చారు. అప్పటినుండి సినిమాపై ఎప్పుడెప్పుడు అప్ డేట్స్ వస్తాయా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇక ‘కేజీఎఫ్ చాప్టర్ 3’ పై ఇప్పటికే హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే.. కేజీఎఫ్ 3 కంటే ముందు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్ తో పాన్ ఇండియా యాక్షన్ మూవీ ‘సలార్‘ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాలిడ్ యాక్షన్ సీక్వెన్సులతో తెరకెక్కుతోంది. మరోవైపు సలార్ కూడా రెండు భాగాలుగా రానుందని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో కేజీఎఫ్ 3 పై పలు క్రేజీ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అదేంటంటే.. కేజీఎఫ్-3 పట్టాలెక్కడానికి మరింత సమయం పడుతుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం.. కేజీఎఫ్ 3 లోకి ప్రభాస్ ఎంటర్ కాబోతున్నాడని టాక్. అంటే.. సలార్ తో ప్రశాంత్ నీల్.. ప్రభాస్ క్యారెక్టర్ ని కేజీఎఫ్ స్టోరీలో భాగం చేయబోతున్నాడని, ఆ విధంగా ప్రభాస్ కేజీఎఫ్ 3లో ఎంట్రీ ఇవ్వనున్నాడని సినీవర్గాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియదుగానీ, అదే గనక జరిగితే ఇండియాలోనే బిగ్గెస్ట్ కాంబినేషన్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి. మరి ప్రభాస్ – యష్ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Powerful People Make Places Powerful
Can’t wait for #Salaar & #KGF 3#Prabhas 🌋 #Yash 🔥 pic.twitter.com/JBUnqGNScY
— 12 January 2023 🏹 (@DrlgPrabhasFan) June 4, 2022