అన్ స్టాపబుల్ టాక్ షో మొదలైనప్పటి నుండి ఎక్కడ చూసినా జై బాలయ్య నినాదాలే వినిపిస్తున్నాయి. అఖండ లాంటి భారీ విజయం తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ.. తదుపరి సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. వీర సింహా రెడ్డి టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాని 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా.. ప్రస్తుతం వీర సింహా రెడ్డి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే.. బాలయ్య ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు అన్ స్టాపబుల్ హోస్ట్ గా ఆహాలో అదరగొడుతున్నాడు. ఇప్పుడు అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ నడుస్తోంది.
ఇక ఇప్పటికే రెండో సీజన్ లో చాలామంది స్టార్స్ పాల్గొని సందడి చేశారు. మాజీ ఏపీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిలతో పాటు మాజీ స్పీకర్ సురేష్ కుమార్, నటి రాధికా శరత్ కుమార్, యువహీరోలు శర్వానంద్, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్ ఇలా చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. అంతేగాక టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ డి. సురేష్ బాబు, అల్లు అరవింద్ లతో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పాల్గొన్నారు. ప్రస్తుతం వీరి ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో వైరల్ అవుతుండగా.. అన్ స్టాపబుల్ లోకి రాబోయే సెలబ్రిటీ గురించి కొన్ని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
అన్ స్టాపబుల్ షోకి రావడానికి టాలీవుడ్ స్టార్స్ అంతా ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో ఓ పాన్ ఇండియా స్టార్ ఈ షోకి త్వరలోనే పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరో రాబోతున్నాడట. మరి ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా? డార్లింగ్ ప్రభాస్. అవును.. అన్ స్టాపబుల్ మొదటి సీజన్ లో కూడా ప్రభాస్ వస్తాడని కథనాలు వెలువడ్డాయి. వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ.. ఈసారి మాత్రం ప్రభాస్ ఖచ్చితంగా షోలో సందడి చేయనున్నాడని టాక్ నడుస్తుంది. అదీగాక ప్రెజెంట్ ప్రభాస్.. ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్ సినిమాల షూటింగ్స్ హైదరాబాద్ లోనే చేస్తున్నాడు. సో.. నిజంగానే బాలయ్య షోలో ప్రభాస్ వస్తే ఆ ఎపిసోడ్ మామూలుగా ఉండదని అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. చూడాలి మరి త్వరలో అధికారిక ప్రకటన రానుందేమో!