కన్నడ హీరో యష్ కెరీర్‌ని పూర్తిగా మార్చేసిన సినిమా కేజీఎఫ్. యశ్‌ని పాన్ ఇండియా స్టార్‌గా నిలిపిన ఈ సినిమా సీక్వెల్ మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కేజీఎఫ్ ఛాప్టర్ 1 పాన్ ఇండియా రేంజ్ బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. దాంతో సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీనికి తగ్గట్లుగానే సీక్వెల్‌ని భారీ బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందించారు మేకర్స్. కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే హోంబలే ఫిలింస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: కేజీఎఫ్-2లో భారీ ట్విస్ట్. రాఖీ భాయ్.. అధీరా కొడుకా?
కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి తుఫాన్ అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తున్నారు మేకర్స్. ఈ ఈవెంట్‌కి ప్రభాస్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ తదుపరి సినిమా అయిన ‘సలార్’కి ప్రశాంత్ నీల్ దర్శకుడు. దాంతో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ గెస్ట్ గా రానున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: మరో సంచలన పాత్రలో యష్! ఈసారి రికార్డ్స్ బద్దలే!ఇంతకు ముందు సలార్ మూవీ ఓపెనింగ్‌కు యశ్ హాజరైన విషయం తెలిసిందే. మరి కేజీఎఫ్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ వస్తాడా అన్న దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ వార్తలు నిజమయ్యి.. ప్రభాస్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి వస్తే.. ఇద్దరు పాన్ ఇండియా స్టార్లును ఒకే వేదిక మీద చూడటానికి అభిమానులకు రెండు కళ్లు సరిపోవు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కొత్త ఇంట్లోకి హీరో యష్! లగ్జరీ హౌస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి