సౌత్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకుపోతుంది స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే. ఇటీవలే దళపతి విజయ్ తో ‘బీస్ట్’ సినిమాలో నటించింది. ఏప్రిల్ 13న బీస్ట్ రిలీజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పూజా కూడా బీస్ట్ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయింది. సాధారణంగా హీరోయిన్లు దాదాపుగా స్టార్ హీరోల సరసన నటించేందుకు ట్రై చేస్తుంటారు. అందులోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ఛాన్స్ వస్తే ఎలా వదులుకుంటారు.
ఇండస్ట్రీలో తమిళ ఇండస్ట్రీలో ప్రస్తుతం పూజాహెగ్డే పేరు మార్మోగిపోతోంది. తమిళంలో తదుపరి సినిమా ఎవరితో చేయబోతుందా? అని వెయిట్ చేస్తున్నారు. అయితే.. విజయ్ తో బీస్ట్ చేశాక, ఆయనతో సినిమా చేయాలన్న కోరిక నెరవేరిందని చెప్పింది. అలాగే విజయ్ గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించింది. ఇదిలా ఉండగా.. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తదుపరి సినిమా సూపర్ స్టార్ రజినీతో చేయబోతున్నాడు.
ఇక బీస్ట్ ప్రమోషన్స్ లో పూజాకు ఇదే ప్రశ్న ఎదురైంది. తలైవా – నెల్సన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో నటించబోతున్నారా? అనే ప్రశ్నకు పూజా స్పందిస్తూ.. “ఏమో ఇంకా ఏమి తెలియదు. ఏదైనా జరగొచ్చు. కానీ రజినీ సర్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా వదులుకోను” అంటూ చెప్పుకొచ్చింది. లాస్ట్ టైం విజయ్ సినిమాకు ముందు కూడా ఇలాగే చెప్పింది.. ఈసారి కూడా కన్ఫర్మ్ అయ్యింది కావచ్చు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి పూజా – రజిని కాంబినేషన్ లో సినిమా పడితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.