ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస పెట్టి పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజలు క్రితమే బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటు టాలీవుడ్‌తో పాటు.. టోటల్ సౌత్ ఇండస్ట్రీ అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నది నయనతార పెళ్లి వార్త కోసం. దక్షిణాదిలో పెళ్లి కాని సీనియనర్ స్టార్ హీరోయిన్లలో ముందు వరసలో.. ఫస్ట్ ప్లేస్‌లో ఉంది నయనతార. ఇప్పటికే 40 ఏళ్లకు దగ్గర పడుతున్నా ఇంకా పెళ్ళి చేసుకోకుండా.. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. వరుస సినిమాలు చేస్తూ.. లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చకుంది నయన్. ఇక ఆమె అభిమానులు నయన్ పెళ్లి వార్త కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ లవ్‌బర్డ్స్ తమ పెళ్లికి ముహుర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో, శ్రీవారి సన్నిధిలో నయన్-విఘ్నేష్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. జూన్ 9న ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: చిరు చెల్లెలి పాత్ర కోసం నయన్‌కు కళ్లు చెదిరే పారితోషికం
పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేసుకోవడం కోసమే నయనతార, విఘ్నేష్ శనివారం తిరుపతి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరు వీఐపీ బ్రేక్ ప్రారంభ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. వేదపండితులు వీరికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రెండు రోజుల క్రితం వీరిద్దరు షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా తిరుమల వచ్చిన వీరు.. పెళ్లికి ముహుర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నయన్-విఘ్నేష్ శివన్‌లు చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాక తమ ప్రేమ విషయాన్ని వీరు రహస్యంగా కూడా ఉంచలేదు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసి వెళ్ళేవారు. ఇక వీరి బంధం స్ట్రాంగ్ అవ్వడంతో.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది అని గతంలో వీరే స్వయంగా తెలిపారు.
ఇది కూడా చదవండి: అభిమానులకి షాక్ ఇస్తున్న నయనతార యాంకరింగ్ వీడియో
గతంలో రెండు సార్లు నయనతార పెళ్లి చేసుకోబోయి మిస్ అయ్యారు. ఫస్ట్ తమిళ స్టార్ హీర్ శింబుతో.. తరువాత స్టార్ డాన్స్ మాస్టర్ ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమలో పడ్డ నయన్.. ఆతరువాత కొన్ని పరిస్థితుల వల్ల వారితో బ్రేకప్ చెప్పారు. ఇక ముచ్చటగా మూడోసారి యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ తో ప్రేమలో పడ్డ నయన్.. ఈసారి తమ బంధాన్ని స్ట్రాగ్ చేసుకుంటూ.. పెళ్ళి పీటల వరకూ వెళ్తున్నారు. ఈ విషయం తెలిసిన నయన్ అభిమానులు.. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లి వార్తలపై నయన్-విఘ్నేష్‌ల నుంచి ఇప్పటి వరకు అధికారక ప్రకటన విడుదల కాలేదు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: సీక్రెట్ గా నయనతార- విఘ్నేష్ పెళ్లి! వైరల్ అవుతున్న వీడియో