సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ జంటగా నటించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మొదటి వారానికే అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆల్రెడీ సూపర్ హిట్స్ తో ఫామ్ లో ఉన్న మహేష్ కి సర్కారు వారి పాట సక్సెస్ మరింత ఊపునిచ్చిందనే చెప్పాలి. అయితే.. సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు.. అగ్రదర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేయనున్నాడు.
ప్రస్తుతం ‘SSMB28’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలుస్తుంది. మహేష్ సరసన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా కనిపించనుంది. దర్శకుడు త్రివిక్రమ్ కూడా మహేష్ కోసం స్క్రిప్ట్ ని పకడ్బందీగా రెడీ చేస్తున్నాడట. అయితే.. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం నేచురల్ స్టార్ నానిని సంప్రదించినట్లు సమాచారం.
సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలలో కామన్ స్పెషల్ క్యారెక్టర్ హైలైట్ అవుతుంటుంది. కాబట్టి.. నానికి కూడా అలాంటి ఓ క్యామియో రోల్ సిద్ధం చేసాడని సినీవర్గాలు చెబుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ – ఎం మహేష్ కాంబినేషన్ లో రానున్న మూడో సినిమా ఇది. ఇదివరకు వీరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా టీవీ ప్రేక్షకులకు ఈ రెండు సినిమాలు ఆల్ టైం ఫేవరెట్స్ గా నిలిచాయి.
ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాగా తెరకెక్కనున్న ‘SSMB28’ పై ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఎందుకంటే.. త్రివిక్రమ్ కూడా అరవిందసమేత, అల వైకుంఠపురంలో సినిమాలతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. మరి మహేష్ తో ఈసారి ఎలాంటి సినిమా తీయనున్నాడో అని ఫ్యాన్స్ లో ఉత్సాహం మాములుగా లేదు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తుంది. మరి మహేష్ సినిమాలో నాని వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.