హీరో నాగచైతన్య టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే 13 సంవత్సరాలు పూర్తయ్యింది. తాజాగా థాంక్యూ సినిమాతో ప్రేక్షకులు మందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక తాజాగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆమిర్‌ఖాన్‌తో నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం నాగచైతన్య లాల్ సింగ్ చద్దా సినిమా కోసం భారీ రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక నాగచైతన్య తాజాగా నటించిన బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా కోసం ఏకంగా 10-5 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ప్రస్తుతం నాగ చైతన్య రెమ్యునరేషన్, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, సినీ కెరీర్ గురించి రమేష్ బాలా పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో భాగంగానే అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’లో బాలా పాత్రకు గాను నాగచైతన్య ఏకంగా 5 కోట్ల పారితోషికం అందుకున్నట్లు వెల్లడించాడు. అలానే ఈ సినిమా భారీ విజయం సాధిస్తే.. నాగచైతన్యకు బాలీవుడ్‌లో మంచి కెరీర్ ఉంటుందని చెప్పుకొచ్చాడు.
ఇక ప్రస్తుతం నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ద్విభాష చిత్రంలో నటించనున్నారు. అలాగే ‘డీజే టిల్లు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విమల్ కృష్ణతో కూడా నాగచైతన్య ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి నాగచైతన్య రెమ్యూనరేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.