స్టార్ హీరోయిన్ సమంత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా కోరుకుంటున్నారు. అయితే కొంతమంది సమంతను నేరుగా హాస్పిటల్ లో పరామర్శించేందుకు ప్రయత్నించారని, సమంత ఆరోగ్యం సహకరించకపోవడంతో కలిసేందుకు వీలు కావడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో అక్కినేని నాగచైతన్య సమంతను పరామర్శించారని, సమంత ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సమంతకు అక్కినేని కుటుంబ సభ్యులు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే సమంత అనారోగ్యంపై అఖిల్ స్పందించగా.. నాగచైతన్య కూడా స్పందించారని వార్తలు వస్తున్నాయి.అసలు నిజంగా చైతూ సమంతని కలిశారా? అని అంటే లేదనే అంటున్నారు. అసలు సమంత హాస్పిటల్ లోనే చికిత్స చేయించుకోవడం లేదంట. ఇంట్లోనే కొన్ని ప్రత్యేక ఏర్పాట్లతో వైద్యం చేయించుకుంటుందని సమాచారం. చైతూ సమంత ఇంటికి వెళ్లి కలిశారన్న వార్తల్లో నిజం లేదని కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. ఒకేవేళ చైతూకి కలిసే ఆశ ఉన్నా.. అటువైపు సమంతకి ఎవరినీ కలవాలని అనుకోవడం లేదట. పూర్తిగా కోలుకున్నాక బయటకు రావాలని, అప్పటి వరకూ తన ముఖం ఎవరికీ చూపించకూడదని అనుకుంటుందట. కాబట్టి చైతూ, సమంతని కలిశారన్న వార్తలో నిజం లేదని అక్కినేని అభిమానులు అంటున్నారు.