టాలీవుడ్ ఇండస్ట్రీలో మా ఎలక్షన్స్ తర్వాత ఏ హీరో పేరు వినిపించనంతగా మంచు విష్ణు పేరు వినిపిస్తోంది. సినిమాల కంటే కూడా ఎక్కువగా సినిమా రాజకీయాల వల్లే ఆయన పేరు వైరల్ అవుతోంది. తనమీద ఎన్ని ట్రోల్స్ వచ్చినా విష్ణు అవేవి లెక్కచేయకుండా ముందుకెళ్తుంటాడు. ఇటీవలే తన కొత్త సినిమా పోస్టర్ ప్రకటించాడు విష్ణు. ఇంకా టైటిల్ కన్ఫర్మ్ కానీ ఈ సినిమాలో విష్ణు ‘గాలి నాగేశ్వరరావు‘ అనే పాత్రలో కనిపించనున్నాడు.
ఇది చదవండి: బ్రేకింగ్: స్టార్ హీరోయిన్ పై కేసు నమోదు! నిజం ఏమిటంటే?
విష్ణు క్యారెక్టర్ లుక్ కొత్తగా ఉండేసరికి మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ అవుతున్నారు. మాములుగా విష్ణు చేసే బయట కామెడీతో పాటు తన సినిమా కామెడీకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విష్ణు సరసన ఇద్దరు హీరోయిన్స్ కనిపించనున్నట్లు తెలుస్తుంది. కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాను అవ ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.
Introducing my new character Gali Nageshwara Rao.. Exciting details coming soon..#VishnuManchu #AskVM #ComingSoon #NewMovie pic.twitter.com/h0mJ2vM4Ba
— Vishnu Manchu (@iVishnuManchu) March 4, 2022
తాజాగా ఈ సినిమాలో విష్ణు సరసన ఇద్దరు హాట్ బ్యూటీలు నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకరు శృంగారతార సన్నీలియోన్ కాగా మరొకరు పాయల్ రాజపుత్ అని సమాచారం. అయితే.. టాలీవుడ్ కి సన్నీని పరిచయం చేసింది కూడా మంచు ఫ్యామిలీనే కావడం విశేషం. ఐటమ్ సాంగ్స్ పక్కన పెడితే సన్నీ చిన్నపాత్రలో కనిపించిన సినిమా.. కరెంట్ తీగ. ఇందులో మంచు మనోజ్ హీరోగా నటించాడు.
ఇక ఎంట్రీ తమ్ముడితో ఇచ్చిన సన్నీ లియోన్.. ఇప్పుడు రీఎంట్రీ అన్నయ్య మంచు విష్ణుతో చేయనుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. మరి విష్ణు సరసన హాట్ బ్యూటీస్ సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్.. ఇద్దరూ కనిపించనున్నారు అనేసరికి మంచు ఫ్యాన్స్ లో ఆనందం రెట్టింపు అయ్యింది. కానీ సన్నీ, పాయల్ నిజంగా విష్ణు సరసన నటిస్తారా? లేదా అనేది అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరి మంచు విష్ణు కొత్త సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.