శ్రీ విద్యానికేతన్ 30వ వార్షికోత్సవం, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ గురూజీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ వేదికపై మరోసారి మా ఎన్నికల వ్యవహారం తెరపైకి వచ్చింది. మంచు మనోజ్ చేసిన కామెంట్సే అందుకు కారణం. సాధారణంగా మంచు కుటుంబంపై మొదటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్, కామెంట్స్ వస్తూనే ఉంటాయి. వాటిపై ఎవరు స్పందించినా కూడా మనోజ్ మాత్రం మౌనంగానే ఉండేవాడు. తన అన్నపై వచ్చిన కామెంట్స్ పై మనోజ్ నేరుగా వేదికపైనే స్పందించాడు.
ఇదీ చదవండి: Jr.ఎన్టీఆర్ కారుని ఆపిన పోలీసులు! కారణం?
మా ఎన్నికల్లో ఆరోపణలు- ప్రత్యారోపణలు, సవాళ్లు- ప్రతి సవాళ్లు ఇలా ఒక చిన్న సైజు రాజకీయ ఎన్నికలను తలపించాయి. పోటాపోటీ పోరులో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసి గెలిచిన సభ్యులు రాజీనామా చేయడం, వాటిని విష్ణు ఆమోదించడం జరిగిపోయాయి. ఇక నుంచి ఎన్నికల గురించి ఎవరం మాట్లాడబోమని విష్ణునే స్వయంగా చెప్పాడు. అలాంటిది ఇప్పుడు మనోజ్ కామెంట్స్ తో మళ్లీ ఆ వ్యవహారం తెరపైకి వచ్చింది. అప్పటి కామెంట్స్ విషయంలో హయ్యర్ పర్పస్ అంటూ మనోజ్ స్పందించాడు.‘హయ్యర్ పర్పస్ లేని వ్యక్తులకు ఏం తోచదు. పక్కవారి మీద పడుతుంటారు. వారికి ఒక లక్ష్యం అంటూ ఉండదు. మా ఎన్నికల విషయాన్నే తీసుకుందా.. పోటీ అంటే రెండు వర్గాలు ఉంటాయి. ఇటు పక్క ఓట్లు వేయమని అడిగారు.. అటుపక్క ఓట్లు వేయమని అడిగారు. పలాన వ్యక్తి గెలిస్తే బాగుంటుందని అందరూ అనుకున్నారు. మా అన్నను గెలిపించారు. అక్కడి దాకా అంతా బాగానే ఉంది. ఇండస్ట్రీలో అందరూ మిత్రులే. ఒకరికి ఒకరం హాని చేసుకోం. ఒక వ్యక్తి మాత్రం మా అన్నని టార్గెట్ చేశాడు. అతడ్ని మానసికంగా ఇబ్బంది పెడదామని ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు. ఆ మాటలను మా అన్న- నాన్న గారు ఇద్దరూ పట్టించుకోలేదు’.
ఇదీ చదవండి: ఆర్జే చైతు ఎలిమినేషన్ వెనుక కుట్ర జరిగిందా?
‘ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వచ్చాయి. మాకు సపోర్ట్ చేసిన పెద్ద పెద్ద వాళ్లను కూడా బూతులు తిట్టాడు. అది మీరంతా చూశారు. వాళ్లెందుకు అలా చేశారా అని ఆలోచించాను. వాళ్లకు హయ్యర్ పర్పస్ లేదు వదిలెయ్ అని నాన్న అన్నారు. అదీ నిజమే కదా అనిపిచింది. తర్వాత ఆయన గురించి ఆలోచించాను. ఆయన చుట్టూ గొప్పగొప్ప వాళ్లున్నారు. హయ్యర్ పర్పస్ కోసం బతికేవాళ్లున్నారు. వాళ్ల ఫ్యామిలీలో జనాల కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉన్నవాళ్లు ఉన్నారు. కానీ, ఆయన మాత్రం అవేవీ లేకుండా ఉండిపోయాడు’ అంటూ మంచు మనోజ్ చెప్పుకొచ్చాడు. అయితే మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు మెగా బ్రదర్ నాగబాబు గురిచే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మనోజ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.