మంచు మనోజ్, భూమా మౌనికల వివాహ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. మంచు లక్ష్మి మొత్తం తానే అయ్యి తమ్ముడి పెళ్లి బాధ్యతలు దగ్గరుండి చూసుకున్నారు. ఇదిలా ఉంటే మనోజ్.. తన భార్య మౌనికకు పెళ్ళికి ముందే మాట ఇచ్చారని.. వార్తలు వస్తున్నాయి. మరి ఆ మాట ఏంటి?
2015లో మంచు మనోజ్, ప్రణతి రెడ్డిల వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే మనస్పర్థలు రావడంతో ఈ జంట 2019లో విడిపోయారు. ఆ తర్వాత మనోజ్ రెండో పెళ్లిపై అనేక రూమర్లు వచ్చాయి. అయితే వాటిపై మనోజ్ స్పందించలేదు. ఖండించలేదు. ఇక గత ఏడాది హైదరాబాద్ లో వినాయక చవితి ఉత్సవాల్లో మనోజ్, భూమా మౌనిక రెడ్డితో కలిసి సందడి చేశారు. దీంతో మనోజ్.. భూమా మౌనికను రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ ఈ ఇద్దరూ ఒకటయ్యారు. శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో మనోజ్, భూమా మౌనికా రెడ్డిల వివాహం జరిగింది. ఫిల్మ్ నగర్ లోని మంచు లక్ష్మి నివాసంలో ఇరువురి కుటుంబ సభ్యులు, అతిథుల, సన్నిహితుల సమక్షంలో వేడుక జరిగింది.
ఈ వేడుకకు దర్శకుడు బాబీ, వెన్నెల కిషోర్, సింగర్ సునీత దంపతులు, నరేష్ పవిత్ర దంపతులు, శివ బాలాజీ దంపతులు సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే మనోజ్ కి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ పెళ్లి మనోజ్ కి, భూమా మౌనికా రెడ్డికి రెండో వివాహం. 2016లో భూమా మౌనికా రెడ్డికి ప్రముఖ వ్యాపారవేత్త గణేష్ రెడ్డితో వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరికి 2018లో ధైరవ్ రెడ్డి అనే కొడుకు జన్మించాడు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. దీంతో కొడుకుని తన దగ్గరే ఉంచుకున్నారు మౌనికా రెడ్డి. ఇక మనోజ్ విషయానికొస్తే ఆయన 2015లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. మనస్పర్థలు రావడంతో 2019లో విడిపోయారు.
పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన భూమా మౌనికా రెడ్డి కుటుంబంతో మంచు కుటుంబానికి ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారి పెళ్లి పీటలు ఎక్కేవరకూ తీసుకొచ్చింది. అయితే ఈ పెళ్లి పీటలు ఎక్కడానికి ముందు మంచు మనోజ్ మౌనికా రెడ్డికి ఒక మాట ఇచ్చారట. ఈ పెళ్లితో మనోజ్ మౌనికా భర్త మాత్రమే కాదు, ధైరవ్ రెడ్డి తండ్రి కూడా అవుతాడు అంటూ మాట ఇచ్చారట. కన్న కొడుకులా చూసుకుంటానని మౌనికా రెడ్డికి పెళ్ళికి ముందు మనోజ్ మాట ఇచ్చారట. పెళ్ళైనా కూడా బాబు మనతోనే ఉంటాడని, సొంత బిడ్డలా చూసుకుంటానని అన్నారట. ఈ నిర్ణయంతో మనోజ్ ది ఎంత స్వచ్ఛమైన ప్రేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి మనోజ్ మంచి మనసుపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.