Jr NTR: నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చారు జూ.ఎన్టీఆర్. క్లిష్టమైన పాత్రల్లో.. అద్భుతమైన నటనను కనబర్చి తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటున్నారు. ఎన్టీఆర్ తాజా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌లో ఆయన నటనకు గానూ మంచి మార్కులు పడ్డాయి. ఇక, ఎన్టీఆర్ సినిమాలో తన పాత్రల కోసం శరీరాన్ని మలుచుకునే తీరు అద్బుతం అని చెప్పొచ్చు. ఆర్‌ఆర్‌ఆర్‌లో ట్రాన్స్‌ఫర్‌మేషన్ కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. ఇలా ప్రతీ సినిమాకు శారీరక శ్రమను అనుభిస్తున్నారు. అదే ఆయనను గాయాల పాలు చేస్తోంది.
జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం భుజాల నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. త్వరలో షూటింగ్ జరుపుకోబోయే సినిమా యాక్షన్ స్వీక్వెన్స్‌ల కోసం సిద్ధం అవుతుండగా ఆయన భుజానికి గాయం అయ్యిందని తెలుస్తోంది. గాయం తాలూకా నొప్పి ఆయన్ని తీవ్రంగా వేధిస్తున్నట్ల సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన వైద్యులను సంప్రదించగా నాలుగు వారాల రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారంట. ఇక, జూ.ఎన్టీఆర్ కొద్దిరోజుల క్రితం భార్య, పిల్లలతో కలిసి విదేశాల్లో వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. వెకేషన్‌లో కుటుంబంతో గడిపిన ఫొటోలను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఎన్టీఆర్ వెకేషన్‌లో ఉన్న టైంలోనే ఆయన మేనత్త ఆత్మహత్య చేసుకున్నారు. వెకేషన్‌నుంచి రావటానికి ఆలస్యం అవ్వటంతో అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజు మేనత్త కుటుంబాన్ని పరామర్శించారు. తల్లి, భార్యతో మేనత్త ఇంటికి వెళ్లారు. కాగా, జూ. ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. మరి, జూ.ఎన్టీఆర్‌కు భుజం నొప్పి వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Urfi Javed: ఆస్పత్రిలో చేరిన బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్.. కారణం ఏంటంటే?