జబర్దస్త్ గీతూ రాయల్ గురించి బిగ్ బాస్ ప్రియులకు, బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా పాపులర్ అయినటువంటి గీతూ.. అదే క్రేజ్ తో జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ లో చిత్తూరు యాసతో కామెడీ అదరగొట్టి ప్రేక్షకులకు దగ్గరైంది. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా గీతూ.. ఇన్ని రోజులపాటు అలరించి ఇటీవల ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చింది. అయితే.. బిగ్ బాస్ లో ఎప్పటికప్పుడు జరుగుతున్న రసవత్తరమైన పోటీ నుండి గీతూ సడన్ గా ఎలిమినేట్ అవ్వడం అందరిని షాక్ కి గురిచేసింది.
ఇక బిగ్ బాస్ నుండి గీతూ వెళ్లిపోవడంపై షాకైన వారికంటే పీడా విరగడైంది.. హౌజ్ లో పీడా వదిలింది అనుకుంటున్నవారే ఎక్కువ. బిగ్ బాస్ చాలా వారాలు స్ట్రాంగ్ పోటీనిచ్చిన గీతూ.. చివరి రెండు వారాలలో చేసిన మిస్టేక్స్ వల్లే బయటికి వచ్చిందని అంతా అనుకుంటున్నారు. కానీ.. గీతూ బిగ్ బాస్ నుండి బయటికి రావడానికి వేరే కారణాలున్నాయని టాక్ నడుస్తోంది. అదేంటంటే.. బిగ్ బాస్ కి వెళ్లకముందు జబర్దస్త్ లో కామెడీ పండించిన గీతూ.. తనదైన యాసతో అందరినీ ఆకట్టుకుంది. తన కామెడీ టైమింగ్ పై విమర్శలు వచ్చినప్పటికీ, అవేవి పట్టించుకోకుండా దూసుకెళ్లింది.
ఈ క్రమంలో అంతలోనే బిగ్ బాస్ లో ఛాన్స్ రావడం.. అందులోకి వెళ్లిపోవడం జరిగింది. అయితే.. బిగ్ బాస్ కి వెళ్లడం వరకూ బాగానే ఉంది. కానీ.. గీతూ బయటికి వచ్చిన కారణం వేరే ఉందట. అదేంటంటే.. బిగ్ బాస్ కంటే ముందు గీతూ.. జబర్దస్త్ లో పుష్ప స్కిట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ స్కిట్స్ తో చిత్తూరు యాసను బాగా పాపులర్ చేసింది. ఆ స్కిట్ తోనే గీతూకి లేడీ కమెడియన్ గా మంచి పేరొచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ నుండి బయటకి రాగానే ఖాళీ లేకుండా.. వచ్చేముందే పుష్ప 2లో ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. పుష్ప స్కిట్ వల్ల గీతూ.. పుష్ప 2లో అవకాశం అందుకుందని.. గీతూ యాస, టాలెంట్ చూసి ఆమెను పుష్ప 2 టీమ్ అప్రోచ్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో గానీ క్లారిటీ అయితే రావాల్సి ఉంది.